కరాటే మాస్టర్లకు ప్రత్యేక సత్కారం

by Nallavelli.Anjaneyulu |

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక సందర్భంగా గత 14 ఆదివారాలు నిర్వహిచింన హ్యాపీ సండే కార్యక్రమంలో కరాటే మాస్టర్లు కోటకద్ర వెంకటేష్, సడ్డె బాలరాజ్ లు క్రమం తప్పకుండా తమ కరాటే కళను ప్రదర్శించారు.

కరాటే మాస్టర్లకు ప్రత్యేక సత్కారం
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక సందర్భంగా గత 14 ఆదివారాలు నిర్వహిచింన హ్యాపీ సండే కార్యక్రమంలో కరాటే మాస్టర్లు కోటకద్ర వెంకటేష్, సడ్డె బాలరాజ్ లు క్రమం తప్పకుండా తమ కరాటే కళను ప్రదర్శించారు. వెంకటేష్ ప్రదర్శించిన కరాటే విన్యాసాలను చూపరులను ఆకట్టుకోవడమే కాకుండా, కొన్ని విన్యాసాలు ఒళ్ళు గగుర్పొడిచే విధంగా ఉండడం, రిటైర్డ్ ఏఎస్ఐ సడ్డె బాలరాజ్ తన చేతి వేళ్లపై కారును నడిపించడం లాంటి అనేక సాహస కృత్యాలను వారు ప్రదర్శించడంతో ఆదివారం నిర్వహించిన చివరి హ్యాపీ సండే సందర్భంగా నగరపాలక మేయర్ మమత, కమిషనర్ రామాంజుల రెడ్డి ప్రత్యేకంగా అభినందించి, వారికి శాలువా, మెమోంటో జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్ ఫోరం ఉపాధ్యక్షడు రాజసింహుడు, ప్రధాన కార్యదర్శి నస్కటి నాగభూషణం వారిని ప్రత్యేకంగా అభినందించారు.

Next Story