- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, హన్వాడ : మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలంలో బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు సజీవ దహనం అయ్యారు. వివరాల్లోకి వెళ్తే .. హన్వాడ మండలం పల్లెమొని కాలనీ - పిల్లిగుండు దగ్గర మహబూబ్ నగర్ - తాండూర్ ప్రధాన రహదారిపై బుధవారం అర్ధరాత్రి 11:55 గంటల సమయంలో ఇందనాల్ ఆయిల్ ట్యాంక్ వాహనం, స్టీల్ కంటైనర్ల వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆయిల్ ట్యాంక్ పేలి బారీగా మంటలు వ్యాపించాయి. భారీ శబ్దం రావడంతో గమనించిన స్థానికులు 100కు సమాచారం అందించారు. స్టీల్ కంటైనర్ వాహన డ్రైవర్ బయటకు దూకడంతో ప్రాణాపాయం తప్పింది. ఆయిల్ ట్యాంక్ వాహన డ్రైవర్ ఆ మంటల్లో పూర్తిగా కాలిపోయి సజీవ దహనం అయ్యాడు. సమాచారం తెలుసుకున్న స్థానిక హన్వాడ ఎస్ఐ వెంకటేష్ సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేలా అగ్నిమాపక సిబ్బందితో పాటు ప్రయత్నం చేశారు. హన్వాడ ఎస్సై వెంకటేష్ తెలిపిన వివరాల మేరకు.. మధ్యప్రదేశ్ రాష్ట్రం మెహర గ్రామానికి చెందిన లవకుశ ప్రసాద్ మిశ్రా (36) ఈ నెల 23వ తేదీన ఉదయం 5 గంటలకు (MH12YB5473) చెన్నయ్ నుంచి పూనేకు స్టీల్ లోడ్ తో బయలుదేరాడు. మార్గ మధ్యలో మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలంలోని పిల్లిగుండు తాండా దగ్గర ఈ నెల 26వ తేదీన 11:55 సమయంలో తాండూర్ నుంచి మహబూబ్ నగర్ వైపు వెళ్తున్న ఇందనాల్ ట్యాంకర్ డ్రైవర్ నిరంజనప్ప (35) (KA28AB1841) ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొనడంతో లారీలో మంటలు చెలరేగడంతో నిరంజనప్ప మృతి చెందాడు. మరో డ్రైవర్ లవకుశ ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేష్ తెలిపారు.






