- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తొలి కార్పొరేషన్ సమావేశంలో కుర్చీల రగడ
మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ ప్రత్యేక సమావేశం అభివృద్ధి చర్చల కంటే ఆరోపణలు, ప్రత్యారోపణలు.. కుర్చీల కొట్లాటతో రసాభాసగా మారింది.

దిశ - మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ ప్రత్యేక సమావేశం అభివృద్ధి చర్చల కంటే ఆరోపణలు, ప్రత్యారోపణలు.. కుర్చీల కొట్లాటతో రసాభాసగా మారింది. పాలక,ప్రతిపక్షాల మధ్య సాగిన వాగ్వాదంతో మున్సిపల్ కార్యాలయంలోని వాతవరణం అంతా ఓక్క సారిగా మారిపోయింది. సమావేశం ప్రారంభం కాగానే స్టేజ్ పై సీటింగ్ ఏర్పాటుపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మేయర్ గుమాల్ మమత పక్కనే డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిలకు సీట్లు కేటాయించడం మేయర్ స్థాయిని తగ్గించడమేనని వారు మండిపడ్డారు. నిబంధనల ప్రకారం.. స్టేజ్ మీద మేయర్ మాత్రమే ఉండాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు ఒంటికాలిపై లేచారు. దీనికి కౌంటర్ గా కాంగ్రెస్ సభ్యులు స్పందించడంతో ఇరువర్గాల మధ్య చిన్నపాటి యుద్ధమే సాగింది. అయితే, పరిస్థితులను బట్టి స్టేజ్ పై స్థానం కల్పించే అధికారం ఉంటుందని కమిషనర్ స్పష్టం చేసినప్పటికీ గొడవ సద్దుమణగలేదు.కరీంనగర్ కార్పొరేషన్ లో కూడ ఓకే సీటు ఉంది అని వారు గుర్తు చేశారు.
భాషా వివాదం :
ఇక బడ్జెట్ అంశాల కంటే భాషా పరమైన డిమాండ్లు సమావేశంలో వింత పరిస్థితిని తెచ్చిపెట్టాయి. మైనారిటీ కార్పొరేటర్లు అజెండా అంశాలను ఉర్దూలో కూడా ప్రింట్ చేయించాలని, తెలుగు అర్థం చేసుకోవడం ఇబ్బందిగా ఉందని కోరారు. దీనికి ప్రతిగా బీజేపీ సభ్యులు స్పందిస్తూ, తమకు అజెండా అంశాలు సంస్కృత భాషలో కావాలని డిమాండ్ చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. మొత్తానికి అజెండాలోని కీలక అంశాలపై చర్చ జరగాల్సిన మొదటి సమావేశం, కేవలం రాజకీయ ఆధిపత్య పోరు మరియు భాషా వివాదాలకే పరిమితమై ప్రజల సమస్యలను పక్కన పెట్టడం గమనార్హం.






