దిశ క‌థ‌నానికి స్పంద‌న‌.. క‌దిలిన యంత్రాంగం

by Ratna Kumari |

అకాల వర్షంతో తడిసిన ధాన్యం, ముసిరిఫా కొనుగోలు కేంద్రంలో రైతన్నల గగ్గోలు అనే శీర్షికతో దిశలో బుధవారం ప్రచురితం కావడం పాఠకులకు తెలిసిందే.

దిశ క‌థ‌నానికి స్పంద‌న‌.. క‌దిలిన యంత్రాంగం
X

దిశ, కోస్గి : అకాల వర్షంతో తడిసిన ధాన్యం, ముసిరిఫా కొనుగోలు కేంద్రంలో రైతన్నల గగ్గోలు అనే శీర్షికతో దిశలో బుధవారం ప్రచురితం కావడం పాఠకులకు తెలిసిందే. బుధవారం నారాయణపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీను ముసిరిఫా కొనుగోలు కేంద్రంతో పాటు ముక్తిపాడు కేంద్రాలను స్వయంగా పర్యవేక్షణ చేసి క్షేత్రస్థాయిలో వరి ధాన్యం కొనుగోలుతో పాటు లారీలలో ధాన్యాన్ని తరలించే ప్రక్రియను సంబంధిత సిబ్బందితో అధికారులతో వివరాలు సేకరించి పరిశీలించారు. రైతన్నలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. రైతన్నలు పండించిన ధాన్యాన్ని ఆరబెట్టుకొని తీసుకువస్తే కేంద్రాల వద్ద రోజుల తరబడి ఉంచుకోవడం సరికాదన్నారు. కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. ధాన్యం తడిసిపోకుండా ఉండేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం పట్టణంలోని ధాన్యం నిల్వ గోదాములను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో త‌హ‌శీల్దార్ శ్రీనివాసులు, పీఏసీఎస్ చైర్మన్ భీమిరెడ్డి, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Next Story