- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి.. కేసు నమోదు
దిశ, రేవల్లి : మండల కేంద్రంలో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే దాసరి శేఖర్(35) అనుమానస్పదంగా మృతి చెందడం..

దిశ, రేవల్లి : మండల కేంద్రంలో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే దాసరి శేఖర్(35) అనుమానస్పదంగా మృతి చెందడం.. మృతదేహం కుళ్లిపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అనుమానస్పద మృతి పై ఎస్ఐ రజిత కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టగా.. అందులో భాగంగానే మృతదేహం కుళ్లిపోవడంతో వనపర్తి జిల్లా కేంద్రం నుంచి వచ్చిన ప్రత్యేక డాగ్ స్కాడ్ లతో సంఘటన స్థలం పరిసరాల్లో క్షుణ్ణంగా పరిశీలించారు. వర్షాలకు ఆధారాలు తుడుచుకుపోవడంతో వాటి ద్వారా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. ఫోరెన్సీక్ పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్రం వనపర్తికి తరలించారు. రేవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చెన్నారం, కొంకలపల్లి, రేవల్లి గ్రామాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు వేర్వేరు కారణాలతో మరణించడం స్టేషన్ పరిసర ప్రాంతమంతా మృతుల కుటుంబ సభ్యుల రోధనలతో చూసిన వారి హృదయాలను కలచివేసింది.






