రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. పరామర్శించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి

by Ratna Kumari |

రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందిన వ్య‌క్తిని ఎమ్మెల్యే మేఘారెడ్డి ప‌రామ‌ర్శించారు. వ‌న‌ప‌ర్తిలోని మార్చురిలో ఉన్న మృత‌దేహాన్ని చూసి కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడి వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. పరామర్శించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి
X

దిశ‌, వ‌న‌ప‌ర్తి టౌన్ : రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందిన వ్య‌క్తిని ఎమ్మెల్యే మేఘారెడ్డి ప‌రామ‌ర్శించారు. వ‌న‌ప‌ర్తిలోని మార్చురిలో ఉన్న మృత‌దేహాన్ని చూసి కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడి వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. గ‌త 20 ఏళ్లుగా వ‌న‌ప‌ర్తి మార్కెట్ యార్డులో కూలి ప‌ని చేసుకుంటూ జీవ‌నం సాగిన పెబ్బేరు మండ‌లం జ‌నంప‌ల్లి గ్రామానికి చెందిన ప‌రశురామ్ ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. తన ద్విచక్ర వాహనం పై వెళ్తుండగా నల్లచెరువు కట్ట దగ్గర ఆయన రోడ్డు ప్రమాదానికి గురయ్యాడని తీవ్రంగా గాయపడ్డ బాధితున్ని వనపర్తి జిల్లా ఆస్పత్రికి తీసుకురాగా చికిత్స పొందుతూ మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు పరుశురాంకు భార్య శారద ఇద్దరు కుమారులు ఉన్నట్లు వారు తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వపరమైన ఆర్థిక సహాయ, సహకారాలు అందేలా చూస్తారని ఎమ్మెల్యే వారికి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story