కుటుంబ క‌ల‌హాలతో వ్య‌క్తి మృతి

by Ratna Kumari |

దిశ‌, కొత్త‌కోట : కుటుంబ కలహాలతో వ్యక్తి మృతి చెందిన ఘ‌ట‌న కొత్త‌కోట మున్సిపాలిటీ ప‌రిధిలో చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మున్సిపాలిటీ ప‌రిధిలోని జనంపల్లి అశోక్ (35 ) పెయింటింగ్

కుటుంబ క‌ల‌హాలతో వ్య‌క్తి మృతి
X

దిశ‌, కొత్త‌కోట : కుటుంబ కలహాలతో వ్యక్తి మృతి చెందిన ఘ‌ట‌న కొత్త‌కోట మున్సిపాలిటీ ప‌రిధిలో చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మున్సిపాలిటీ ప‌రిధిలోని జనంపల్లి అశోక్ (35 ) పెయింటింగ్ పని చేస్తున్నాడు. భార్య శాంతమ్మ కూలి పని జీవనం కొనసాగించే వారు. కొద్ది రోజుల నుంచి భార్య శాంతమ్మతో కొట్లాటలు జరుగుతూ ఉండేవని చెప్పారు. బుధవారం భార్య, భర్తలు మళ్లీ కొట్లాడుకున్నారు. అనంతరం భార్య శాంతమ్మ కూలి పనికి వెళ్లిందని, అశోక్ మనస్థాపంతో ఇంట్లోకి వెళ్లి ఉరి వేసుకున్నాడని చెప్పారు. మృతునికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక కొడుకు ఉన్నారని తెలిపారు.

Next Story