మరబోటులో ‘మరణం అంచున’ ప్రయాణం

by Elthuri vijay kumar |

తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దు గుండా ప్రవహిస్తున్న కృష్ణానది పై మరబోటుల్లో ప్రయానికుల ప్రయాణం ప్రమాదపు టంచున కోనసాగుతుంది.

మరబోటులో ‘మరణం అంచున’ ప్రయాణం
X

మరబోటులో ‘మరణ’ ప్రయాణం

- కాసులకు కక్కుర్తి పడుతున్న ఆంధ్రా బోటు నిర్వాహకులు

- నదిపై రక్షణ లేని మరబోటు ప్రయాణం

- మంచాలకట్ట టు మూర్వ కొండ

- పర్యవేక్షించని అధికారులు.. పొంచి ఉన్న ముప్పు

దిశ, పెంట్లవెల్లి : తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దు గుండా ప్రవహిస్తున్న కృష్ణానది పై మరబోటుల్లో ప్రయానికుల ప్రయాణం ప్రమాదపు టంచున కోనసాగుతుంది. నాగర్ కర్నూల్ జిల్లాలో ఉదృతంగా పొంగి ప్రవహిస్తున్న కృష్ణానది అలల పై మరబోటుల్లో యథేచ్ఛగా ప్రయాణికులను ఆంధ్ర-తెలంగాణ మధ్య రాకపోకలను కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా మూర్వకొండ నుంచి ప్రయాణికులను మరబోటుల్లో ఎక్కించుకొని కృష్ణానది పై తెలంగాణ లోని మంచాలకట్ట ఘాట్ కు వారం రోజులుగా చేరవేస్తున్నారు. అయితే తెలంగాణ బోటు నిర్వాహకులను నిషేదించిన ఆంధ్ర అధికారులు తమ ప్రాంతం మరబోటు నిర్వాహకులతో చేతులు కలిపి దందా కొనసాగిస్తున్నారని ఇక్కడి (మంచాలకట్ట ) బోటు నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. ఆంధ్ర అధికారుల సహకారం ఉండడం తో నది పై ప్రయాణం లో బోటు నిర్వాహకులు సామార్త్యానికి మించి ప్రయానికుల తో యదేచ్చగా నది పై రాక పోకలను కొనసాగిస్తున్నారు. అయినా ఎలాంటి రక్షణ చర్యలను తీసుకున్న దాఖలాలు లేవు. బోటు లో ప్రయానించే ప్రతి వ్యక్తికి సేఫ్టీ జాకెట్ ధరించాలి. కానీ అలాంటి చర్యలు ఏవి లేవు. ఒక్కో ప్రయానికుడితో పోనురాను రూ.200 వసూలు చేస్తున్నారు. తెలంగాణ వైపు నుంచి మర బోట్ల ను ఆంధ్ర ప్రాంతానికి చెందిన పోలీసు అధికారులు నిర్వాహకులను అనుమతించడం లేదు. ఇదే ప్రాంతంలో 2007 జనవరి 17న సింగోటం జాతరకు ఆంధ్ర ప్రాంతానికి చెందిన భక్తులు సామర్థ్యానికి మించి మరబోటులో నదిలో వస్తూ బోటు మునిగి 61మంది భక్తులు మృత్యువాతపడిన విషయం విధితమే. అలాంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా పోలీసులు, రెవెన్యూ మత్స్యశాఖ అధికారులు మంచాలకట్ట పుష్కర ఘాట్ వద్ద పర్యవేక్షణ చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు జిల్లా అధికారులను కోరుతున్నారు.

Next Story