- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చేపల వల తీయడానికి వెళ్లి వ్యక్తి మృతి
చేపల వల తీయడానికి వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల పరిధిలోని అంబటిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

X
దిశ, లింగాల : చేపల వల తీయడానికి వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల పరిధిలోని అంబటిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై వెంకటేశ్వర గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దకొత్తపల్లి మండలం చెన్నపు రావుపల్లి గ్రామానికి చెందిన పిట్టల చిన్న రంగన్న (70) అనే వ్యక్తి గత ఏడు నెలలుగా అంబటిపల్లి గ్రామ పరిధిలోని లింగసముద్రం చెరువులో కాపలాగా పని చేస్తున్నాడు. బుధవారం చెరువులో చేపల వల తీయడానికి వెళ్లిన సమయంలో, ప్రమాదవశాత్తు చేపల వల ఆయన కాళ్లకు చుట్టుకొని నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి కుమారుడు పిట్టల ఆంజనేయులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి రంగన్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Next Story






