ఉరి వేసుకుని వ్యక్తి మృతి

by Nallavelli.Anjaneyulu |

దిశ, తెలకపల్లి : ఉరి వేసుకొని వ్య‌క్తి మృతి చెందిన ఘ‌ట‌న తెల‌క‌ప‌ల్లి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్లితే.. తెలక‌ప‌ల్లి మండ‌ల ప‌రిధిలోని క‌మ్మారెడ్డి పల్లి గ్రామానికి

ఉరి వేసుకుని వ్యక్తి మృతి
X

దిశ, తెలకపల్లి : ఉరి వేసుకొని వ్య‌క్తి మృతి చెందిన ఘ‌ట‌న తెల‌క‌ప‌ల్లి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్లితే.. తెలక‌ప‌ల్లి మండ‌ల ప‌రిధిలోని క‌మ్మారెడ్డి పల్లి గ్రామానికి చెందిన యాల‌ల మ‌ల్ల‌య్య(45), సునిత దంప‌తులు. వీరి మ‌ధ్య 15 ఏళ్ల కింద‌ట గొడ‌వ జ‌ర‌గ‌డంతో భార్య సునిత కూతురు, కొడుకును తీసుకొని హైద‌రాబాద్ కి వ‌ల‌స వెళ్లారు. అయితే వీరు దాదాపు 15 సంవ‌త్స‌రాల నుంచి హైద‌రాబాద్ లోనే ఉంటున్నారు. మ‌ల్ల‌య్య కూలి ప‌ని చేసుకుంటూ వ‌చ్చిన డ‌బ్బుతో మ‌ద్యం సేవిస్తూ కాలాన్ని గ‌డుపుతున్నాడు. భార్య‌, పిల్ల‌లు ఇంటి నుంచి వెళ్లిపోయిన విష‌యంలో మ‌నోవేద‌న‌కు గురై.. మ‌ద్యానికి బానిస‌య్యాడు. ఇంటి ముందు ఉన్న హ‌ర్వెస్ట‌ర్ వ‌రికోత మిష‌న్ కి ఉన్న రాడ్డుకి ట‌వ‌ల్ తో ఉరేసుకొని చ‌నిపోయాడు. మృతుడి అన్న యాలాల కృష్ణ‌య్య ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.

Next Story