- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆటోను ఢీ కొట్టిన లారీ.. పలువురికి గాయాలు
by Ratna Kumari |
లారీ ఆటోను ఢీకొట్టడంతో పలువురికి గాయాలైన సంఘటన మండలంలోని మల్లాపూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది.

X
దిశ, మిడ్జిల్ : లారీ ఆటోను ఢీకొట్టడంతో పలువురికి గాయాలైన సంఘటన మండలంలోని మల్లాపూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మాదారం నుంచి మిడ్జిల్ వస్తున్న లారీ, మిడ్జిల్ నుండి మల్లాపురం వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో పలువురికి తీవ్రంగా గాయపడ్డారు. ఆటోలో 13 మంది వరకు ఉన్నారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. సమాచారం తెలుసుకున్న మాజీ సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు జంగారెడ్డి, బంగారులు గాయపడ్డ వారిని 108 అంబులెన్స్ లో ఎక్కించారు. మల్లాపూర్ గ్రామానికి చెందిన దాసరి కృష్ణయ్య, వడ్డే గంగమ్మలకు తీవ్రంగా గాయపడ్డారు. మిగతా వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 108 సిబ్బంది గౌస్, హేమలత ప్రథమ చికిత్స నిర్వహించారు. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Next Story






