- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒక తరాన్ని ప్రభావితం చేసేదే గ్రంథాలయం : గ్రంధాలయ సంస్థ కార్యదర్శి వై.శ్యాంసుందర్
దిశ, కందనూల్ : పుస్తకం ఒక వ్యక్తి జీవితాన్ని మారిస్తే.. గ్రంథాలయం ఒక తరాన్ని ప్రభావితం చేస్తుందని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వై.శ్యాంసుందర్ అన్నారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో

దిశ, కందనూల్ : పుస్తకం ఒక వ్యక్తి జీవితాన్ని మారిస్తే.. గ్రంథాలయం ఒక తరాన్ని ప్రభావితం చేస్తుందని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వై.శ్యాంసుందర్ అన్నారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో మంగళవారం విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుస్తకం ఒక వ్యక్తి జీవితాన్ని మారిస్తే గ్రంథాలయం ఒక తరాన్ని ప్రభావితం చేస్తుందన్నారు. విజ్ఞాన కేంద్రాలుగా విరసిల్లుతున్న గ్రంథాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత పాఠకులందరిపై ఉందన్నారు. విద్యా, గ్రంథాలయం సమాజానికి రెండు కళ్ల లాంటివన్నారు. విద్యార్థుల వివిధ పోటీ పరీక్షల్లో పాల్గొన్నప్పుడే వారిలో దాగి ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ కార్యాలయం ఇంచార్జి ఆర్.పరమేశ్వరి, లైబ్రేరియన్ జిలానీబేగం, ఉద్యోగులు అరుంధతి, కర్నె వెంకటేష్, తాజుద్దీన్, ఉపాధ్యాయులు, గ్రంథాలయ పాఠకులు, విద్యార్థులు పాల్గొన్నారు.






