కాంగ్రెస్ పార్టీకి కీల‌క నేత‌ రాజీనామా

by Ratna Kumari |

మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో బీసీ లకు జరిగిన అన్యాయం, అసమానతలకు నిరసనగా కీల‌క నేత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

కాంగ్రెస్ పార్టీకి కీల‌క నేత‌ రాజీనామా
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో బీసీ లకు జరిగిన అన్యాయం, అసమానతలకు నిరసనగా జిల్లా కేంద్రం సమీపంలోని తిమ్మసానిపల్లె మాజీ సర్పంచ్, ఉపసర్పంచ్, పీఏసీఎస్ వైస్ చైర్మెన్, కాటన్ మిల్ మాజీ అధ్యక్షుడు కె.బ్రహ్మయ్య, ఆయన సతీమణి కె.మంజుల గురువారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో తాము 19 డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున తన సతీమణి కె.మంజుల నామినేషన్ దాఖలు చేస్తే, తాము పార్టీకి చేసిన సేవలు, ప్రజల్లో తమకున్న అనుభందం గుర్తించకుండా, జూనియర్ నాయకులకు ప్రాధాన్యత ఇచ్చారని ఆయన ఆవేదనతో అసంతృప్తి వ్యక్తంచేస్తూ, తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

Next Story