- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉద్యమకారుల గుర్తింపునకు జ్యుడీషియల్ కమిటీ ఏర్పాటు చేయాలి : ఫ్రీడమ్ ఫైటర్ జేఏసీ నేత శ్రీనివాస్
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన నిజమైన ఉద్యమకారులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జ్యుడీషియల్ కమిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్ జేఏసీ నేత శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

దిశ, అచ్చంపేట రూరల్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన నిజమైన ఉద్యమకారులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జ్యుడీషియల్ కమిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్ జేఏసీ నేత శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రాష్ట్ర హైకోర్టు సూచనల మేరకు ఉద్యమకారులకు అభయహస్తం కింద కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు. రాజకీయ ప్రభావాలకు అతీతంగా, పారదర్శకంగా నిష్పక్షపాతంగా గుర్తింపు ప్రక్రియ జరగాలంటే చట్టబద్ధమైన జ్యుడీషియల్ కమిటీ ఏర్పాటు అత్యవసరమని తెలిపారు. రాజకీయ పరిణామాల ప్రభావంతో కమిటీ ఏర్పాటులో ఆలస్యం జరిగితే నిజమైన ఉద్యమకారులు నష్టపోయే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు.క్షేత్రస్థాయిలో నిజమైన ఉద్యమకారులను గుర్తించి, వారికి తగిన గౌరవం, సంక్షేమం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయం పై తక్షణ నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.






