- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్తపల్లి-జూరాల మధ్య హై లెవల్ వంతెన నిర్మించాలి
కృష్ణానదిపై హై లెవెల్ వంతెన నిర్మాణం కొత్తపల్లి-జూరాల గ్రామాల మధ్యనే నిర్మించాలని కోరుతూ... కొత్తపల్లి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం కొత్తపల్లి, గుంటిపల్లి, రేకులపల్లి, చెనుగోనిపల్లి గ్రామాలకు చెందిన దాదాపు 500మందికి పైగా ప్రజలు కిష్టారెడ్డి బంగ్లా నుంచి ర్యాలీ నిర్వహించారు.

కొత్తపల్లి-జూరాల మధ్య హై లెవల్ వంతెన నిర్మించాలి
గద్వాల ఆత్మకూర్ కు మధ్య దూరం తగ్గింపు
వంతెన నిర్మించే వరకు పోరాటం ఆగదని తేల్చిన ప్రజలు
దిశ, గద్వాల రూరల్ : కృష్ణానదిపై హై లెవెల్ వంతెన నిర్మాణం కొత్తపల్లి-జూరాల గ్రామాల మధ్యనే నిర్మించాలని కోరుతూ... కొత్తపల్లి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం కొత్తపల్లి, గుంటిపల్లి, రేకులపల్లి, చెనుగోనిపల్లి గ్రామాలకు చెందిన దాదాపు 500మందికి పైగా ప్రజలు కిష్టారెడ్డి బంగ్లా నుంచి ర్యాలీ నిర్వహించారు. గాంధీచౌక్ మీదుగా వైఎస్సార్ చౌకు చేరుకున్న తర్వాత రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గద్వాల మండల సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు అశోక్ రెడ్డి, ఆత్మకూర్ మార్కెట్ చైర్మన్ రహమతుల్లాలు మాట్లాడుతూ కొంతమంది నాయకులు అప్పట్లో రాజకీయం చేయడం వల్ల మా గ్రామాలు తీవ్రంగా అన్యాయానికి గురయ్యాయని వివరించారు. 1975లో జూరాల-కొత్తపల్లి మధ్య డ్యామ్ వస్తే దానిని 17కిలోమీటర్ల ఎగువన కట్టారని వివరించారు. పేరు జూరాలది ప్రయోజనాలు పొందింది మాత్రం అక్కడ ఉన్న గ్రామాలని వివరించారు. ఆయా గ్రామాలలో ఎంతోమంది ఉద్యోగాలు పొంది మంచిజీవనం సాగిస్తున్నారని మాగ్రామాల ప్రజలు అభివృద్ధికి దూరంగా ఉన్నారని విమర్శించారు. 1964లో నేషనల్ హైవే కూడ కొత్తపల్లి మీదుగా ప్రతిపాదన అయితే దానిని కూడ బీచుపల్లికి మార్చారని గుర్తు చేశారు.
గద్వాల, ఆత్మకూర్ సంస్థానాల రాజులు కొత్తపల్లి వద్దే సుంకరిగుడి అనే చెకోపోస్టును ఏర్పాటు చేసి పడవల ద్వార నదిని దాటించేవారని చెప్పారు. ఇంత ప్రాచీనం ఉన్న కొత్తపల్లి- జూరాలకు ప్రతిసారి అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణానదిపై కొత్తపల్లి వద్ద బ్రిడ్జిని నిర్మిస్తే గద్వాల- ఆత్మకూర్ ల మధ్య దూరం కేవలం 9కిలోమీటర్లు మాత్రమే ఉంటుందని.. అదే ప్రాజెక్టు వద్ద బ్రిడ్జి నిర్మిస్తే 30కిలో మీటర్లు అవుతుందని వివరించారు. హైద్రాబాద్ కు దాదాపు 30కిలో మీటర్ల దూరం తగ్గి గంట సమయం ఆదా అవుతుందని వివరించారు. ఆత్మకూర్, అమరచింత, నారాయణపేట ప్రాంతాలకు వ్యాపార సంబందాలు పెరిగి అభివృద్ధి శరవేగంగా సాగుతుందని వివరించారు. బ్రిడ్జి నిర్మాణం కోసం ఎంతటి ప్రాణ త్యాగానికైన సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. అనంతరం కలెక్టరేటు వరకు ర్యాలీగా తరలివెళ్లి అక్కడ ఏఓకు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో ఆత్మకూర్ బీజేపీ పట్టణ మాజీ అధ్యక్షులు తమ్మలి విజయ్, బీఆర్ యస్ నాయకులు హసీమ్, గుంటిపల్లి మాజీ సర్పంచు మన్నెస్వామి, మాజీ ఎంపీటీసీ శివకుమార్, నాయకులు హనుమంత్రెడ్డి, చెనుగోనిపల్లి సురేష్ తెలుగు అంజి, శ్రీరామ్డ్డి, పరుష, మనోహర్, శంకర్, రాజు, విజయ్, తదితరులు పాల్గొన్నారు.






