- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మృతుడి కుటుంబానికి మిత్ర బృందం రూ. 1లక్షా 6వేల ఆర్థిక సాయం
by Ratna Kumari |
రోడ్డు ప్రమాదంలో భర్త తిరుపతయ్య మృతి చెందగా భార్య లక్ష్మి కాళ్లు చేతులు విరిగి ఆస్పత్రి పాలై చికిత్స పొందుతుంది. అందరూ కలిసి పోగు చేసుకున్న రూ. లక్షా 6వేలు నగదును శనివారం కొత్త పేట గ్రామ యువకుల సమక్షంలో మృతుడి పిల్లలకు ఆర్థిక సాయం సర్పంచ్ మానస భర్త రాకేష్ అందజేశారు.

X
దిశ, పెద్ద కొత్త పల్లి : మండల పరిధిలోని కొత్తపేట గ్రామానికి చెందిన మంగ దొడ్డి తిరుపతయ్య ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో మృతి చెందిన విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదంలో భర్త తిరుపతయ్య మృతి చెందగా భార్య లక్ష్మి కాళ్లు చేతులు విరిగి ఆస్పత్రి పాలై చికిత్స పొందుతుంది. దీంతో మృతుడికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు ఉన్నారు. కుటుంబాన్నీ పోషించే ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి అనాధలైనా చిన్న పిల్లలు, క్షతగాత్రురాలైనా తల్లిని ఎలా పోషించాలో దిక్కుతోచని పరిస్థితిలో బాధిత కుటుంబానికి మిత్రబృందం అండగా నిలబడింది. అందరూ కలిసి పోగు చేసుకున్న రూ. లక్షా 6వేలు నగదును శనివారం కొత్త పేట గ్రామ యువకుల సమక్షంలో మృతుడి పిల్లలకు ఆర్థిక సాయం సర్పంచ్ మానస భర్త రాకేష్ అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.
Next Story






