- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మత్తు వదిలితేనే మంచి భవిష్యత్ : ప్రిన్సిపాల్ శ్రీనివాసులు
దిశ, ఎర్రవల్లి : మత్తు వదిలితేనే విద్యార్థులు, యువతకు మంచి భవిష్యత్ ఉంటుందని తెలంగాణ గురుకుల పాఠశాల కళాశాల (బాలుర) బీచుపల్లి ప్రిన్సిపల్ బి శ్రీనివాసులు అన్నారు. మంగళవారం

దిశ, ఎర్రవల్లి : మత్తు వదిలితేనే విద్యార్థులు, యువతకు మంచి భవిష్యత్ ఉంటుందని తెలంగాణ గురుకుల పాఠశాల కళాశాల (బాలుర) బీచుపల్లి ప్రిన్సిపల్ బి శ్రీనివాసులు అన్నారు. మంగళవారం విద్యార్థులతో సామూహిక మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదక వినియోగం, అక్రమ రవాణా నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం 15 ఆగస్టు 2020 నుంచి నషాముక్త్ భారత్ అభియాన్‌ను దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుందన్నారు. విద్యార్థులు యువత క్రీడలు చదువు మంచి అలవాటు అలవర్చుకునేలా ప్రోత్సహించడం అత్యంత అవసరమని అన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రపంచానికి ఆదర్శంగా దిశ నిర్దేశం చేస్తున్న వేళ, ప్రాచాత్య సంస్కృతి మనదేశంలో చొరబడి ప్రజల జీవనశైలి చిన్నాభిన్నం చేస్తున్నాయి. మాదక ద్రవ్యాలను మనం ప్రోత్సహించడం చేయకూడదని, మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతోందని వాటిని దూరం పెట్టడమే ఏకైక పరిష్కారం అని విద్యార్థులకు సూచించారు.






