- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థిని ప్రసవం ఘటనపై పూర్తి విచారణ చేపట్టాలి
ఇంటర్ విద్యార్థిని ప్రసవించిన సంఘటన పై సమగ్ర విచారణ జరిపి ఎస్ఓ, ఏఎన్ఎం, క్లాస్ టీచర్, సిబ్బందినీ సస్పెండ్ చేయాలని కేజీవీబీ జిల్లా పర్యవేక్షణ అధికారిణి శోభారాణి కి బుధవారం డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు పి.శివశంకర్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు.

దిశ, కొల్లాపూర్ : నియోజకవర్గంలోని ఓ కేజీబీవీ పాఠశాలలో చదువుతున్న ఇంటర్ విద్యార్థిని ప్రసవించిన సంఘటన పై సమగ్ర విచారణ జరిపి ఎస్ఓను ఏఎన్ఎం, క్లాస్ టీచర్, సిబ్బందినీ సస్పెండ్ చేయాలనీ కేజీ బీవీల జిల్లా పర్యవేక్షణ అధికారిణి శోభారాణి కి బుధవారం అందజేసిన ఫిర్యాదులో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు పి.శివశంకర్ డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లాలో ఓ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం (కేజీబీవీ)లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ప్రసవించిన ఘటన పై విద్యార్థి, యువజన సంఘం జిల్లా నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం కేజీ బీవీ పాఠశాలను డీవైఎఫ్ఐ ప్రతినిధి బృందం సందర్శించింది. డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు పి.శివశంకర్, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు మీదే కార్తీక్ లు మాట్లాడుతూ ఈ ఘటన విద్యార్థుల ఆరోగ్య పర్యవేక్షణలో నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.
సంబంధిత ఎస్ ఓ, ఏఎన్ఎం క్లాస్ టీచర్ ని సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. విద్యార్థులపై సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలాంటి సంఘటన చోటు చేసుకుందని వారు తెలిపారు. ఈఎస్ఓ గతంలో కూడా పర్యవేక్షణ లోపం వల్ల రెండుసార్లు సస్పెండ్ అయిన విషయాన్ని వారు గుర్తు చేశారు. సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. జిల్లా విద్యాశాఖ అధికారులు పూర్తి స్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఎస్ఓను తొలగించి, సిబ్బందిని సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.






