అమ్మ లేదు.. నాన్న చంపేశాడు

by Nallavelli.Anjaneyulu |

అభం శుభం తెలియని.. ఆ పిల్లలకు చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమ తెలియదు. నాన్న పెంపకంలోనే పెరుగుతూ వచ్చారు ఆ పిల్లలు. కానీ ఆ తండ్రి భార్యకి విడాకులు ఇవ్వడం.. జీవితంపై విరక్తితో ఈ బతుకు వద్దు అనుకున్నాడు.

అమ్మ లేదు.. నాన్న చంపేశాడు
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: అభం శుభం తెలియని.. ఆ పిల్లలకు చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమ తెలియదు. నాన్న పెంపకంలోనే పెరుగుతూ వచ్చారు ఆ పిల్లలు. కానీ ఆ తండ్రి భార్యకి విడాకులు ఇవ్వడం.. జీవితంపై విరక్తితో ఈ బతుకు వద్దు అనుకున్నాడు. తాను లేకుంటే తన పిల్లల పరిస్థితి ఏమవుతుందో అని భావించి తన పిల్లలను ఇద్దరినీ హతమార్చి.. మృత్యువుతో పోరాడి.. ప్రాణాలు వదిలిన ఓ తండ్రి కి సంబంధించిన ఘటన మంగళవారం నారాయణపేట జిల్లా మరికల్ మండలం తేలేరు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్లితే.. శివ రాములు అనే వ్యక్తికి పెద్ద చక్రం గ్రామానికి చెందిన మహిళతో పది సంవత్సరాల క్రితం వివాహం అయింది. ఈ నేపథ్యంలో వీరికి రిత్విక (8), చైతన్య (5) జన్మించారు. మొదటి నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి అని తెలిసింది. ఈ నేపథ్యంలో చైతన్య పుట్టినరోజు నెలలకే ఆ తల్లి భర్త, పిల్లలను వదిలేసి పుట్టిన ఊరుకు వెళ్ళిపోయింది. ఈ క్రమంలోనే ఆమె విడాకులకు కోర్టును ఆశ్రయించింది. గత మార్చి నెలలో కోర్టు భార్యాభర్తలకు విడాకులు మంజూరు చేసింది. దీనితో జీవితంపై విరక్తి చెందిన శివరాములు తన జీవితాన్ని ముగించాలి అనుకున్నాడు. తాను మరణిస్తే.. తన పిల్లల పరిస్థితి ఏమవుతుందో అని భయపడి వారిని కూడా తనతోపాటు తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడప్పుడు వ్యవసాయ కులానికి వెళ్లవలసి వస్తే రాత్రిపూట తన పిల్లలను కూడా అక్కడికే తీసుకొని వెళ్లేవాడు. కూతురు రిత్వికకు జ్వరం పట్టడంతో సోమవారం రాత్రి స్థానికంగా ఉన్న వైద్యునికి చూపించి.. పిల్లలు ఇద్దరిని యధావిధిగా కులం వద్దకు తీసుకువెళ్లాడు. ఇదే సరైన సమయం అని భావించి పిల్లలు ఇరువురికి పురుగుల మందు తాగించి.. తాను తాగాడు.. కానీ ఆ మందు సరిగా పనిచేయకపోవడం వల్లనో.. ఇతర కారణాలవలను పిల్లలు చనిపోలేదు.. దీనితో ఆ తండ్రి పిల్లలను ఒకరి తర్వాత మరొకరిని గొంతు నుమిలి చంపివేసి కాలువ బురదలో పడవేశాడు.. ప్రాణాలు పోలేదేమో అని బురదలోకి తొక్కేశాడు.

గ్రామంలో విషాదఛాయలు

అనంతరం ఆ తండ్రి ప్రాణాలు పోకపోవడంతో సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ ను పట్టుకొని చావాలి అనుకున్నాడు. షాక్ కొట్టడంతో దూరంగా విసిరి వేయబడి అచేతన స్థితిలో పడిపోయాడు. చివరకు తనకు సమీపంలో ఉన్న గడ్డపారతో పొడుచుకొని ఆత్మహత్య చేసుకోవాలనుకున్న.. శరీరము అతడికి సహకరించలేదు. తప్పని పరిస్థితిలలో మంగళవారం తెల్లవారుజామున తమ బంధువులకు పరిస్థితిని ఫోన్ ద్వారా చెప్పాడు.. వారు ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు తెలియజేశారు. వెంటనే ఎస్సై రాము ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కాల్వ నుండి పిల్లలను, తండ్రిని తీసి వాహనములో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పిల్లలు ఇద్దరు మరణించి ఉన్నట్లుగా వైద్యులు ధృవీకరించారు. చావు బతుకుల మధ్య ఉన్న శివరాములను వైద్య సేవల కోసం మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్య సేవలు పొందుతూ మంగళవారం సాయంత్రం శివ రాములు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇద్దరు పిల్లలతో సహా.. తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

అంత్యక్రియలకు రాని తల్లి

తన మాజీ భర్త సంగతి అటు ఉంచితే.. పిల్లల కోసమైనా ఆ తల్లి రాకపోతుందా అని భావించి పోలీసులు సమాచారం ఇచ్చారు. నేను రాను నాకు వాళ్లకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పినట్లు సమాచారం. భర్త పై ఎంత కోపం ఉన్నా.. కనీసం పిల్లల ను కడసారిగా చూడడానికి తల్లి రాలేదు. మంగళవారం సాయంత్రం పిల్లల ఇద్దరి అంత్యక్రియలను బంధువులు పూర్తి చేశారు.

Next Story