- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యక్తి మృతికి కారణమైన ఎనిమిది మందిపై కేసు నమోదు
వ్యక్తి మృతికి కారణమైన ఎనిమిది మంది పై కేసు నమోదైన ఘటన మండల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

దిశ, నర్వ : వ్యక్తి మృతికి కారణమైన ఎనిమిది మంది పై కేసు నమోదైన ఘటన మండల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై పబ్బతి రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. నాలుగు రోజుల కిందట చాకలి రవి అనే వ్యక్తి అనుమానస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసు పై ఈనెల 23న రవి తల్లి గోవిందమ్మ ఫిర్యాదు చేసింది. దీంతో రవి మృతికి కారణమైన ఎనిమిది మంది నిందితులపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు ఎస్సై రమేష్. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 108 r/w 3(5) ప్రకారం.. కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
ఈ కేసులో నిందితులు
కర్నూలు జిల్లాకు చెందిన మంగమ్మ, చంద్రుడు, మహేశ్వరి, సుధాకర్, నర్సమ్మ, లక్ష్మయ్య, స్వాములు, రాంబాబు. ఈ ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి.. మక్తల్ జ్యూడీషియల్ కోర్టులో హాజరు పరచగా.. న్యాయ స్థానం వారిని జ్యూడీషియల్ రిమాండ్ కి తరలించినట్టు ఎస్సై పబ్బతి రమేష్ తెలిపారు.






