- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాత కక్షల నేపథ్యంలో మహిళపై దాడి.. కేసు నమోదు
పాత కక్షల నేపథ్యంలో ఓ మహిళపై ఆమె బంధువే ఇంట్లోకి చొరబడి దాడికి పాల్పడిన ఘటన వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలంలో చోటు చేసుకుంది.

దిశ, వీపనగండ్ల : పాత కక్షల నేపథ్యంలో ఓ మహిళపై ఆమె బంధువే ఇంట్లోకి చొరబడి దాడికి పాల్పడిన ఘటన వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వల్లభాపుర తండాకు చెందిన రాథావత్ సువాలి అనే వితంతువు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తోంది. ఆమె పొలం పక్కనే ఆమె బావ అయినటువంటి గోపాల్ పొలం కూడా ఉంది. భూమి విషయంలో వీరి కుటుంబాల మధ్య గత కొంతకాలంగా తగాదాలు నడుస్తున్నాయి. బుధవారం సువాలి తన ఇంట్లో ఉండగా.. గోపాల్ కుమారుడైన రాథావత్ ప్రకాష్ అక్రమంగా ఇంట్లోకి చొరబడ్డాడు. పాత గొడవలను మనసులో పెట్టుకొని ఆమెను అసభ్య పదజాలంతో దూషిస్తూ.. గట్టిగా పట్టుకుని కింద పడేశాడు. ఆమెపై కూర్చుని విచక్షణారహితంగా కొడుతూ, లైంగిక వేధింపులకు గురి చేయడమే కాకుండా చంపేస్తానని బెదిరించాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. జనం రావడం గమనించిన నిందితుడు ప్రకాష్ అక్కడి నుండి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు.






