యువకుడిపై దాడి కేసులో 11 మందిపై కేసు నమోదు

by Nallavelli.Anjaneyulu |

ఇటీవల చనిపోయిన ఒక నాయకుడి పై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుపై ఒక వర్గానికి చెందిన 11 మంది కలిసి ఆ యువకుడిని చితకబాదిన సంఘటన మహబూబ్ నగర్ పట్టణంలో ఆదివారం సాయంత్రం జరిగింది.

యువకుడిపై దాడి కేసులో 11 మందిపై కేసు నమోదు
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ఇటీవల చనిపోయిన ఒక నాయకుడి పై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుపై ఒక వర్గానికి చెందిన 11 మంది కలిసి ఆ యువకుడిని చితకబాదిన సంఘటన మహబూబ్ నగర్ పట్టణంలో ఆదివారం సాయంత్రం జరిగింది. డిఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపిన వివ‌రాల‌ ప్రకారం.. ఇటీవల జరిగిన యుద్ధంలో మరణించిన ఒక నాయకుడు పై పట్టణంలోని ఒక ప్రాంతానికి చెందిన ఓ యువకుడు సోషల్ మీడియాలో కామెంట్ పెట్టాడని, ఆ కామెంట్ పై కొందరు యువకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ యువకుడిపై దాడి చేశారని డీఎస్పీ తెలిపారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయాన్ని బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి హత్యాయత్నం కేసు నమోదు చేయాలని మంగళవారం డీఎస్పీ కార్యాలయం వద్ద బైఠాయించి ఆర్ అండ్ బీ చౌరస్తాలో బీజేపీ కార్పొరేటర్ గూండా సంతోష్ ఆధ్వర్యంలో గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. దాడిచేసిన 11 మంది యువకులలో 9 మంది ని అరెస్ట్ చేశామని, మిగిలిన 2 పరారీలో ఉన్నట్లు వారిని కూడా అరెస్ట్ చేస్తామని డీఎస్పీ తెలిపారు. నిందితులపై 118 (క్లాజ్ 1), 61, 196 (ఆర్/డబ్ల్యూ),190 బిఎన్ఆర్ సెక్షన్ల నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు ఆయన తెలిపారు. సోషల్ మీడియా వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ట్సాగ్రాం లలో కుల,మతాలకు సంబంధించి రెచ్చగొట్టే పోస్టులు, వ్యాఖ్యలు పెడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వెంకటేశ్వర్లు హెచ్చరించారు.

Next Story