- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంది కడుపులో ఏనుగు పిల్ల జననం
నాగర్ కర్నూల్ జిల్లాలో వింత సంఘటన చోటు చేసుకుంది. పంది కడుపులో ఏనుగు పిల్ల జననం ఆదివారం చోటు చేసుకుంది.

దిశ, పెద్దకొత్తపల్లి : నాగర్ కర్నూల్ జిల్లాలో వింత సంఘటన చోటు చేసుకుంది. పంది కడుపులో ఏనుగు పిల్ల జననం ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దకొత్తపల్లి మండలం పెద్ద కార్పాముల గ్రామానికి చెందిన కురాకుల వెంకటయ్య పందుల పోషణతో జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే ఒక పందికి మొదటి ఈతలో ఏడు పిల్లలకు జన్మనిచ్చింది. ఇందులో రెండు పిల్లలు చనిపోయాయి. చనిపోయిన వాటిలో అచ్చం ఏనుగు దంతంను పోలి ఉండి ఏనుగు పిల్ల ఆకారంలో జన్మించింది. దీంతో పంది కడుపులో ఏనుగు పిల్ల జన్మించిందనే వింత విషయం గ్రామంలో ధవనంలా వ్యాపించింది. పంది కడుపులో వింతగా ఏనుగు పిల్ల జన్మించిందని తెలియడం తో గ్రామస్థులు చూసేందుకు పందుల యజమాని కూరాకుల వెంకటయ్య ఇంటికి బారులు కట్టారు. ఆనాడు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో బోధించిన విషయం నేడు నిజమైందని పెద్దకార్పాముల గ్రామస్థులు అంటున్నారు. ఈ వింత విషయాన్ని తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు ఉల్లంగోండ్ల, మల్లేష్ తెలిపారు.






