8.75 క్వింటాల నల్ల బెల్లం స్వాధీనం

by Nallavelli.Anjaneyulu |

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం సిద్దాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మార్లపాడు తండా గ్రామ పరిధిలో అక్రమంగా నాటు సారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం 8.75 క్వింటాళ్లు స్వాధీనం చేసుకున్న‌ట్టు పోలీసులు తెలిపారు.

8.75 క్వింటాల నల్ల బెల్లం స్వాధీనం
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం సిద్దాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మార్లపాడు తండా గ్రామ పరిధిలో అక్రమంగా నాటు సారా తయారీకి ఉపయోగించే నల్ల బెల్లం (Black Jaggery) నిల్వ ఉంచినట్లు పక్క సమాచారం రావడంతో సిబ్బందితో తనిఖీ నిర్వహించామని ఎస్సై అంజయ్య బుధవారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. అత‌ని ఇంట్లో 30 బస్తాలలో దాదాపు 8.75 క్వింటాళ్ల నల్ల బెల్లం ఉన్నట్లు గుర్తించామని, నాటు సారా కోసం మార్ల‌పాడు గ్రామానికి చెందిన సబావత్ నిరంజన్ అక్రమంగా నిల్వ ఉంచినట్లు తెలిపారు. గ్రామస్తులు ద్వారా పంచనామా చేసి నిర్ధారించిన‌ట్టు తెలిపారు. వ్యక్తి పై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నామన్నారు. అక్రమంగా నాటుసారా తయారు చేసిన నల్ల బెల్లం అమ్మకాలు జరిగిన చట్టపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Next Story