- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
8 లక్షల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి లక్ష్యం : మంత్రి వాకిటి శ్రీహరి
ఈ ఏడాది తెలంగాణలో 8లక్షల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి లక్ష్యం గా పెట్టుకున్నామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.

దిశ, మక్తల్ : ఈ ఏడాది తెలంగాణలో 8లక్షల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి లక్ష్యం గా పెట్టుకున్నామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. చికెన్, గుడ్లు, మటన్ లకు ప్రచారం ఉన్నట్లే చేపలకు కూడా ప్రకటనలు ఉండాల్సిన అవసరం ఉందని.. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో చేపల కూర మేనులో ఉండేలా ప్రణాళికలు రూపొంది స్తున్నామన్నారు రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి. సోమవారం నోవాటెల్ హోటల్ లో ఏర్పాటు చేసిన జాతీయ మత్స్య అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో 12 వ గవర్నింగ్ బాడీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మత్స్య పరిశ్రమ లో భారత దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తోందన్నారు. తెలంగాణ లోసుమారు 4 లక్షల 25 వేల మంది సభ్యులతో 6,212 మత్స్య సహకార సంఘాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రం లో ఉన్న అన్నీ నీటి వనరుల్లో 123 కోట్ల బడ్జెట్ తో 100శాతం సబ్సిడీ తో ఉచిత చేప పిల్లలను పంపిణీ చేశామని, భారత దేశం లో ఏ రాష్ట్రం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టలేదన్నారు.
తెలంగాణ రాష్ట్రం నుంచి అంతర్జాతీయంగా చేపల ఎగుమతి పెంచేందుకు హైదరాబాద్ లోని కోహెడ లో 47 కోట్ల వ్యయం తో హోల్ సేల్ ఫిష్ మార్కెట్ నిర్మాణం చేపడుతున్నామని మంత్రి తెలిపారు. కరీంనగర్ జిల్లా లోయర్ మానేరు డ్యామ్ వద్ద రెండున్నర కోట్ల తో ఐసిఎఅర్ -సిఐఎఫ్ఎ భాగస్వామ్యం తో ముర్రెల్ చేపల కోసంసెంటర్ అఫ్ ఎక్సలెన్స్,రంగారెడ్డి, నిజామాబాదు జిల్లాల్లో హైజీనిక్ హోల్ సేల్ రిటైల్ మార్కెట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జాతీయ మత్స్య అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జాతీయస్థాయి ఫిష్ ఫెస్టివల్ ని నిర్వహించాలని కేంద్ర మంత్రి లాలన్ సింగ్ ని కోరారు. ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ విజిట్స్ కోసం అధికారులకు మత్స్యకారులకు అవకాశం ఇవ్వాలన్నారు.






