మైన‌ర్ బాలిక‌పై అత్యాచారం.. ముగ్గురు ఉపాధ్యాయుల‌తో పాటు ఏడుగురు అరెస్ట్

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-03-29 12:50:10  IST  )

మ‌ద్దూర్ మండ‌లం మోమినాపూర్ గ్రామంలోని జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌లో మైన‌ర్ బాలిక‌కు సంబంధించిన ఘ‌ట‌న‌లో 7 మంది నిందితుల‌ను పోలీసులు రిమాండ్ కి పంపిన‌ట్టు ఎస్పీ డాక్ట‌ర్ వినీత్ తెలిపారు.

మైన‌ర్ బాలిక‌పై అత్యాచారం.. ముగ్గురు ఉపాధ్యాయుల‌తో పాటు ఏడుగురు అరెస్ట్
X
దిశ, నారాయణపేట ప్రతినిధి/ మద్దూరు: నారాయణపేట జిల్లా మద్దూరు మండలం మోమీనాపూర్ గ్రామంలో ఎస్ఎస్సీ విద్యార్థినితో అనుచితంగా ప్రవర్తించి, పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టిన ఉపాధ్యాయుడితో పాటు.. మొత్తం ఏడుగురిపై ఫోక్సో, ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి నిండితులను రిమాండ్కు పంపిన‌ట్టు నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. మ‌ద్దూరు మండలం మోమినా పూర్ గ్రామంలో జిల్లా ప‌రిష‌త్ ఉన్నత పాఠశాలలో స్వామి తెలుగు ఉపాధ్యాయునిగా పని చేస్తున్నాడు. ఇతనికి, మరో ఉపాధ్యాయుడు గుర్నాథ్ రెడ్డికి వ్యక్తి గత విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్వామి పదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థి నీతో చనువుగా ఉన్న‌ విషయాన్ని గుర్తించాడు. ఎవరికి తెలియకుండా కంప్యూటర్ ల్యాబ్ లో సీసీ కెమెరాను సెలవు రోజులలో అమర్చి తన సెల్ ఫోన్ తో అనుసంధానం చేసుకున్నాడు. ఈనెల 7న విద్యార్థినితో ఉపాధ్యాయుడు స్వామి అసభ్యకరంగా వ్యవహరించిన అంశాన్ని గుర్తించి మరో ఉపాధ్యాయుడు చెన్నకేశవులు దృష్టికి తీసుకువెళ్లాడు.

అతను ఈ విషయాన్ని బయటకు రాకుండా ప్రయత్నం చేశాడు. మరోవైపు గురునాథ్ రెడ్డి ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ భర్త రవి, డి ఆనంద్, విజయకుమార్, మేకల రవి అనే వ్యక్తుల దృష్టికి తీసుకువెళ్లాడు. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాలలో సంఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ వైరల్ అయింది. సమస్య బయటకు పక్కకుండా.. రాజీ కుదురుచేందుకు ప్రయత్నాలు చేశారు. సంఘటన జరిగి 20 రోజులకు పైగా గడవడం.. ఆ నోట ఈ నోట పడి విద్యాశాఖ అధికారుల దృష్టికి వెళ్లడంతో.. డీఈవో గోవిందరాజులు విచారణ జరిపి నివేదికను ఉన్నతాధికారుల దృష్టికి పంపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పోలీసులకు సంఘటనకు సంబంధించి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో పోలీసులు విచారణ జరిపి స్వామి విద్యార్థినితో అనుచితంగా వ్యవహరించడమే కాకుండా పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డట్లు పోలీసుల విచారణలో తేలింది. డీఎస్పీ నల్లపు లింగయ్య ఆధ్వర్యంలో విచారణ జరిపి నిందితులను ఏడుగురిని అదుపులోకి తీసుకొని ఫోక్సో, ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ కు తరలించారు

వెంటనే ఫిర్యాదు చేయండి :

విద్యాసంస్థలు, ఇతర కార్యాలయాలు, పని చేసే చోట్లలో ఏమైనా ఇబ్బందులు, వేధింపు ఘటనలు ఎదురైతే స్థానిక పోలీసులకు గాని.. లేదా అత్యవసర సేవలకు 100, 112, 1098 నంబర్లకు ఫోన్ చేయాలి అని ఎస్పీ వినీత్ కోరారు. ఏవైనా సంఘ వ్యతిరేక కార్యకలాపాలు, మహిళలపై దురాగకాలు, నేరాలు జరిగితే వాటిని దాచిపెట్టడం, లేదా రాజీ కుదిరించడం వంటివి చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

Next Story