- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాన్ గల్ లో వృద్ధుడి దారుణ హత్య
మండల కేంద్రంలో గురువారం ఎనుముల కుంటి కిష్టయ్య (65) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు

దిశ, పాన్ గల్: మండల కేంద్రంలో గురువారం ఎనుముల కుంటి కిష్టయ్య (65) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.వనపర్తి సీఐ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కిష్టయ్య గొర్రెల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగించేవాడు. ఈ తరుణంలోనే గత రాత్రి ఇంట్లో నిద్రిస్తూ ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి హత్య చేశారని మృతుడి చిన్న కుమారుడు శివయ్య ఇచ్చిన ఫిర్యాదు చేసాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుగుతున్నట్లు వనపర్తి సీఐ కృష్ణ తెలిపారు.
గ్రామానికి చెందిన కొందరి వ్యక్తులపై అనుమానం ఉందని కుటుంబ సభ్యులు తెలుపగా వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సిఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కాగా సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ పరిశీలించారు. వృద్ధుడి హత్య ఘటనపై ఆరా తీశారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తులో మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎస్పి వెంట డీఎస్పీ వెంకటేశ్వరావు,సిఐ కృష్ణ, స్పెషల్ బ్రాంచ్ సిఐ నరేష్ ఎస్సై శ్రీనివాసులు ఉన్నారు.






