- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళలకు 60 వేల బాకీ చీరతో మురిపించారు : ఎంపీ డీకే అరుణ
దిశ, నారాయణపేట ప్రతినిధి : కాంగ్రెస్ ఎన్నికల సమయంలో మహిళలకు రూ. 2500 పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు రాష్ట్రంలోని ప్రతి

దిశ, నారాయణపేట ప్రతినిధి : కాంగ్రెస్ ఎన్నికల సమయంలో మహిళలకు రూ. 2500 పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు రాష్ట్రంలోని ప్రతి మహిళకు ప్రభుత్వం సుమారు 60వేలు బాకీ ఉందని.. ఈ విషయాన్ని కప్పి పుచ్చుకునేందుకు బతుకమ్మ చీర పేరుతో మహిళలను మురిపిస్తున్నారని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. శుక్రవారం నారాయణపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీకే అరుణ మాట్లాడుతూ భూములను అమ్మి రాష్ట్రాన్ని పాలించే పరిస్థితి ఏర్పడిందన్నారు. రోడ్లు వేయడానికి... ప్రభుత్వ పనులు చేయడానికి కాంట్రాక్టర్లు కూడా ముందుకు రావడంలేదని బిల్లులు వస్తాయన్న నమ్మకం లేదని పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం కేంద్ర నిధుల ద్వారానే జరుగుతుందన్నారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావం రోజురోజుకీ పెరగడం మంచిది కాదనీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధి అంటేనే ప్రజా సమస్యలను అర్థం చేసుకునే పాలకులను ప్రజలు కోరుకుంటారని అలాంటి వారిని గ్రామంలో సర్పంచులుగా వార్డు మెంబర్లుగా ఎన్నుకోవాలని కోరారు. పంచాయతీలకు కేంద్రం నేరుగా నిధులు అందిస్తుందని... కేంద్రం అందించిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్కకు మళ్ళించడం ఎంతవరకు సమంజసంమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామపంచాయతీలకు పెండింగ్ బిల్లులు చెల్లిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి నేటి వరకు నయా పైసా చెల్లించలేదని మండిపడ్డారు. నారాయణపేట నియోజకవర్గం లో అత్యధికంగా బీజేపీ మద్దతుదారులను గెలిపిస్తే తన ఎంపీ నిధులను ప్రత్యేకంగా కేటాయిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల పథకాలు గొంగడి వేసుకుని పడుకున్నాయని ఎద్దేవా చేశారు. జిల్లా అధ్యక్షులు సత్య యాదవ్, నాగురావు నామాజీ, రతంగ్, శ్యాంసుందర్ గౌడ్, రఘురామయ్య గౌడ్, పోషల్ వినోద్, మిర్చి వెంకటయ్య, సత్య రఘుపాల్ పాల్గొన్నారు.






