తొలిసారికే 6 ట‌న్నుల ఆయిల్ ఫామ్ దిగుబ‌డి

by Ratna Kumari |

దిశ, పెంట్లవెల్లి (కొల్లాపూర్) : కొల్ల‌పూర్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని పెంట్లవెల్లి మండలం గోపులా పురంలో రైతు విజయభాస్కర్ రెడ్డి తన వ్యవసాయ

తొలిసారికే 6 ట‌న్నుల ఆయిల్ ఫామ్ దిగుబ‌డి
X

దిశ, పెంట్లవెల్లి (కొల్లాపూర్) : కొల్ల‌పూర్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని పెంట్లవెల్లి మండలం గోపులా పురంలో రైతు విజయభాస్కర్ రెడ్డి తన వ్యవసాయ పొలం లో 2022 డిసెంబర్ లో ఆయిల్ పామ్ తోటను సాగు చేశాడు. కేవ‌లం 34 నెలలకే ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చింది. సోమవారం కొల్లాపూర్ డివిజన్ ఉధ్యాన శాఖ అధికారి లక్ష్మణ్ సమక్షంలో రైతు విజయ భాస్కర్ రెడ్డి ఆయిల్ ఫామ్ తోట మొదటి పంటను కోయగా.. 6 టన్నుల దిగుబడి వచ్చింది. కోసిన ఆయిల్ పామ్ పంట గెల్లల నాణ్యత పరిమాణంను సదరు అధికారి పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. వాస్తవంగా ఈ పంట నాలుగో సంవత్సరం నుంచి మొదలుకొని 35 నుండి 40 సంవత్సరాల వరకు రైతుకు స్థిరమైన ఆదాయం నెల నెల వస్తుందని అధికారి లక్ష్మణ్ తెలిపారు. తొలుత ఏడు సంవత్సరాల లోపు ఒక ఎకరానికి నాలుగు నుంచి ఐదు టన్నుల దిగుబడి నిస్తుందని, 8 సంవత్సరాల తర్వాత నుండి 12 టన్నులు ఒక ఎకరానికి దిగుబడి వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఒక టన్ను ధర రూ, 19,400 లు ఉంద న్నారు. చెట్టు వయసు పెరిగేకొద్దీ చెట్టు మొదలు చుట్టు సైజ్ పెరిగే విధంగా సైజు కూడా క్రమంగా పెరగడంతో దిగుబడి కూడా పెరుగుతుందని ఆయన వివరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఆయిల్ పామ్ ఏరియా ఎక్స్టెన్షన్ ప్రోగ్రాం (NMEO -OP) ద్వారా రైతులు ఆయిల్ పామ్ పంటలను విస్తరించి లాభాలను పొందాలని కొల్లాపూర్ ఉద్యానవన శాఖ అధికారి లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు.

Next Story