- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
5.80 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
మండల పరిధిలోని యంకి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని శనివారం స్వాధీనం చేసుకున్నారు.

దిశ, నర్వ : మండల పరిధిలోని యంకి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని శనివారం స్వాధీనం చేసుకున్నారు. నర్వ సబ్ ఇన్ స్పెక్టర్ పబ్బతి రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్హెచ్ఓ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది యంకి గ్రామంలో తనిఖీలు చేపట్టారు. యంకి గ్రామానికి చెందిన ఎరుకలి శ్రీనివాసులు(41) మాసన్న తన నివాసంలో అక్రమంగా నిల్వ ఉంచిన 19 బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ సుమారు రూ.14,500 ఉంటుందని అధికారులు ధృవీకరించారు. నిందితుడు చుట్టు పక్కల గ్రామాల ప్రజల నుంచి తక్కువ ధరకు బియ్యాన్ని సేకరించి ఇక్కడ తన ఇంటిలో అక్రమంగా నిల్వ చేసినట్టు విచారణలో తేలింది. పంచాయతీదారుల సమక్షంలో పంచనామా నిర్వహించి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అలాగే నర్వ మండల ఎన్ ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహశీల్దార్ ఏ.నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించామని తెలిపారు. ప్రభుత్వ బియ్యాన్ని అక్రమంగా తరలించిన లేదా విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.






