వైన్స్ షాపుల‌కు 51 ద‌ర‌ఖాస్తులు

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, కంద‌నూల్ : 2025–2027 పాలసీ సంవత్సరానికి సంబంధించిన 67 వైన్స్ షాపుల‌కు ఇప్పటివరకు మొత్తం 51 దరఖాస్తులను గురువారం అధికారులు స్వీకరించారు. నాగర్‌కర్నూల్ జిల్లా

వైన్స్ షాపుల‌కు 51 ద‌ర‌ఖాస్తులు
X

దిశ‌, కంద‌నూల్ : 2025–2027 పాలసీ సంవత్సరానికి సంబంధించిన 67 వైన్స్ షాపుల‌కు ఇప్పటివరకు మొత్తం 51 దరఖాస్తులను గురువారం అధికారులు స్వీకరించారు. నాగర్‌కర్నూల్ జిల్లా ప్రోహిబిషన్, ఎక్సైజ్ కార్యాలయంలో దరఖాస్తుల ప్రక్రియను మహబూబ్ నగర్ డిప్యూటీ కమిషనర్ విజయ భాస్కర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్లికెంట్లకు తగిన సౌకర్యాలు కల్పించి, వైన్స్ షాప్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు స్పష్టంగా తెలియజేయాలన్నారు. అభ్యర్థుల సందేహాలను వెంటనే నివృత్తి చేయాలని ఆదేశించారు. జిల్లా ప్రోహిబిషన్, ఎక్సైజ్ అధికారి గాయత్రి మాట్లాడుతూ అక్టోబర్ 9న మొత్తం 10 అప్లికేషన్లు అందాయని.. ఇప్పటి వరకు మొత్తం 51 దరఖాస్తులు స్వీకరించినట్లు వివరించారు. నాగర్‌కర్నూల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 30, తెలకపల్లిలో 6, కొల్లాపూర్లో 2, కల్వకుర్తిలో 13 దరఖాస్తుల అందినట్లు వెల్లడించారు. అక్టోబర్ 18వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంటుందని తెలిపారు.


Next Story