- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రాథమిక పాఠశాలకు 50 వేల విరాళం
దిశ, పాన్ గల్ : మండల పరిధిలోని రేమద్దుల ప్రాథమిక పాఠశాలకు బీఆర్ఎస్ జిల్లా నాయకులు, ప్రముక పారిశ్రామికవేత్త ఫీట్ల కతాల్ రూ.50వే

X
దిశ, పాన్ గల్ : మండల పరిధిలోని రేమద్దుల ప్రాథమిక పాఠశాలకు బీఆర్ఎస్ జిల్లా నాయకులు, ప్రముక పారిశ్రామికవేత్త ఫీట్ల కతాల్ రూ.50వేల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ బృందం కోరిక మేరకు పాఠశాలలో విద్యార్థులకు అవగాహన జ్ఞానం పెంపొందించేందుకు పాఠశాలకు స్వాతంత్య్ర సమరయోధులు భారతదేశ చిత్ర పటం, ప్రపంచ చిత్ర పటాల పెయింటింగ్ వేసేందుకు తన వంతు సహకారంగా రూ.50వేలు విరాళం అందజేసినట్టు తెలిపారు. గతంలో కూడా విద్యాభివృద్ధి కోసం పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, సౌండ్ సిస్టం అందజేసినట్టు గుర్తు చేశారు. భవిష్యత్తులో కూడా తన వంతు సహకారం ఎప్పుడూ అందజేస్తానని తెలిపారు. ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు దాతకు కృతజ్ఞతలు తెలిపారు.
Next Story






