- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అయ్యప్ప శరణు ఘోషల మధ్య.. ఘనంగా 43వ మహాపూజ
దిశ, మక్తల్ : పట్టణంలోని అయ్యప్పకాలనీలో మణికంఠ దేవాలయంలో అయ్యప్ప శరణు ఘోషల మధ్య.. ఘనంగా 43వ మహాపూజ నిర్వహించారు.

దిశ, మక్తల్ : పట్టణంలోని అయ్యప్పకాలనీలో మణికంఠ దేవాలయంలో అయ్యప్ప శరణు ఘోషల మధ్య.. ఘనంగా 43వ మహాపూజ నిర్వహించారు. అయ్యప్ప స్వామి మండపాన్ని నిర్మించి విద్యుత్, పుష్పాలంకరణ మధ్య ఉత్సవ విగ్రహాన్ని ఉంచి మహా పూజ జరిపారు. దేవాలయం పై కప్పు వేసేందుకు మంత్రి వాకిటి శ్రీహరి రూ.25 లక్షల చెక్కును ఆర్థిక సాయం చేశారు. అంతకు ముందు పట్టణంలోని ఆజాద్ నగర్ లో ఉన్న పురాతనమైన శివాలయం నుంచి అయ్యప్ప స్వామి పూర్ణ, పుష్కల కలశంను పూలతో అలంకరించిన వాహనంలో పుర వీధుల గుండా భజనలు, మేళ తాళాలతో శోభయాత్రతో అయ్యప్ప స్వామి గుడికి చేరుకొని అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో స్వామి ఉత్సవ విగ్రహానికి అభిషేకాలు, పుష్పార్చన నిర్వహించి.. అనంతరం కనకాభిషేకాన్ని నిర్వహించారు. అయ్యప్ప స్వామి 18 మెట్ల పూజలు నిర్వహించారు. భక్తుల అయ్యప్ప స్వాముల శరణు ఘోష మధ్యన మహా మంగళ హారతిని నిర్వహించారు. అనంతరం మాలదారణ జరిగిన 40 రోజులుగా అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న వారందరికీ అన్ని విధాలుగా సేవలు నిర్వహించిన వారికి మహా పూజకు కావలసిన పూజ పండ్లు, పూలు, అన్నదానానికి సేవలు చేసిన వారికి గురుస్వామి అశోక్ గౌడ్ తాళంపల్లి అనిల్ శేట్టి శాల్వలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.






