- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కు చట్టబద్దత కల్పించాలి : బీసీ హక్కుల సాధన సమితి
దిశ, కొల్లాపూర్ : బీసీ లకు 42 శాతం రిజర్వేషన్స్ అమలు చేసి ప్రభుత్వం చట్ట బద్దత కల్పించాలని బీసీ హక్కుల సాధన సమితి నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెబ్బేటి విజేయుడు డిమాండ్ చేశారు.

దిశ, కొల్లాపూర్ : బీసీ లకు 42 శాతం రిజర్వేషన్స్ అమలు చేసి ప్రభుత్వం చట్ట బద్దత కల్పించాలని బీసీ హక్కుల సాధన సమితి నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెబ్బేటి విజేయుడు డిమాండ్ చేశారు. మంగళవారం ఆ సంఘం ఆధ్వర్యంలో స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి బన్సీలాల్ కు వినతి పత్రాన్ని ఆ సంఘం నాయకులు అందజేశారు.ఈ సందర్బంగా బీసీ హక్కుల సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి పెబ్బేటి విజయుడు మాట్లాడుతూ బీసీలకు రావలసిన 42 శాతం రిజర్వేషన్స్ వచ్చే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో చట్టబద్ధత ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసిన కేంద్ర ప్రభుత్వం ఆమోదించ లేదు. భవిష్యత్తులో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వకుంటే అన్ని బీసీ సంఘాలు కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పై పెద్ద ఎత్తున ఉద్యమ చేపట్టవలసిన వస్తుందని పెబ్బేటి విజేయుడు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సంఘం నాయకురాలు ఆర్, ఇందిరమ్మ, బీసీ నాయకులు మామిడి చెట్ల వెంకటస్వామి, సిపిఐ కొల్లాపూర్ మండల కార్యదర్శి తుమ్మల శివుడు బీసీ సంఘం నాయకులు కే ధర్మరాజు, బీసీ సంఘం యువ నాయకులు సంఘం బాలస్వామి, సంఘముని రాములు, జంగిటి నిరంజన్ కొండా సురేష్, పెబ్బేటి ఎల్లయ్య, సరోజ, శివలింగం ఆర్య శివ పాల్గొన్నారు.






