- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ షాక్.. ఒకరికి తీవ్ర గాయాలు, ఇద్దరికీ స్వల్పంగా..!
ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో ఒకరికి తీవ్రగాయాలు మరో ఇద్దరికి స్వల్ప గాయాలైన సంఘటన బిజినేపల్లి మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది.

దిశ, బిజినేపల్లి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో ఒకరికి తీవ్రగాయాలు మరో ఇద్దరికి స్వల్ప గాయాలైన సంఘటన బిజినేపల్లి మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్ నగర్ నుంచి నాగర్ కర్నూల్ వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న కో ఆపరేటివ్ బ్యాంక్ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న షట్టర్ పనులు రోజువారి లాగానే భవన నిర్మాణ కార్మికులు నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో మొదటి ఫ్లోర్ లో స్లాబ్ వేయడం కోసం ఐరన్ రాడ్లు అల్లుతున్న క్రమంలో ఒక కార్మికుడు రాడ్లను పైకి ఎత్తే క్రమంలో పక్కనే ఉన్న 33 కేవీ హై టెన్షన్ విద్యుత్ వైర్లకు తగలడంతో విద్యుత్ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో శాయిన్ పల్లికి చెందిన శ్రీనుకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇక మరో ఇద్దరు కార్మికులు బిజినేపల్లికి చెందిన చెన్నయ్య, పోలేపల్లికి చెందిన యాదయ్యలకు స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో గమనించిన స్థానికులు 108కి సమాచారం ఇవ్వడంతో హుటా హుటిన అక్కడికి చేరుకున్న ఈఎంటి రవి కుమార్, పైలట్ వెంకటయ్యలు మెరుగైన వైద్యం కోసం నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించామని తెలిపారు.






