32 కోట్ల తో అజిల్లాపూర్ ఎత్తిపోతల పనులకు శంకుస్థాపన

by Ratna Kumari |

దేవరకద్ర మండలం అజిల్లాపూర్ లో సాగునీటి ఎత్తిపోతల పథకం పనులకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు లు శనివారం శంకుస్థాపన చేయనున్నట్లు కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు.

32 కోట్ల తో అజిల్లాపూర్ ఎత్తిపోతల పనులకు  శంకుస్థాపన
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : దేవరకద్ర మండలం అజిల్లాపూర్ లో సాగునీటి ఎత్తిపోతల పథకం పనులకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు లు శనివారం శంకుస్థాపన చేయనున్నట్లు కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు అజిలాపూర్ గ్రామంలో 32.05 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించి తలపెట్టిన అజిలాపూర్ ఎత్తిపోతల పథకానికి మంత్రులు భూమి పూజ చేసి శంకుస్థాపన అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని 3-50 గంటల నుండి 5 గంటల వరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 5 జిల్లాల్లో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పై ఆయా జిల్లాల కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో విస్తృతంగా సమీక్షిస్తారని, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మిల్లింగ్ ప్రక్రియ, గిడ్డంగుల లభ్యత పై దిశానిర్దేశం చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. 5 గంటల నుండి ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ప్రభుత్వ గోదాములు, రైస్ మిల్లులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతులు, మిల్లుల యజమానులతో మాట్లాడుతారని కలెక్టర్ ఖుష్బూ గుప్తా వివరించారు.

Next Story