జడ్చర్ల పట్టణంలో 3 డెంగ్యూ కేసులు నమోదు

by Taduka Kalyani |   (  Updated:2025-07-23 16:06:03  IST  )

జడ్చర్ల మున్సిపాలిటీలో 3 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులు జవహర్ నగర్, సంజీవయ్య కాలనీ, కృష్ణ రెడ్డి నగర్ లో నమోదు అయ్యాయి

జడ్చర్ల పట్టణంలో 3 డెంగ్యూ కేసులు నమోదు
X

దిశ, జడ్చర్ల : జడ్చర్ల మున్సిపాలిటీలో 3 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులు జవహర్ నగర్, సంజీవయ్య కాలనీ, కృష్ణ రెడ్డి నగర్ లో నమోదు అయ్యాయి. దీంతో పట్టణ ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు ఆందోళనకు గురవుతున్నారు. పట్టణంలో ఎక్కడ చూసినా మురుగునీరు నిల్వ ఉండటంతో పాటు దోమల బెడద అధికంగా ఉందని దోమల నివారణకు మున్సిపాలిటీ అధికారులు ఫాగింగ్ చేయడం లేదని వెంటనే దోమల నివారణ చేపట్టి డెంగ్యూ భారీ నుంచి కాపాడాలని మున్సిపాలిటీ ప్రజలు కోరుతున్నారు. కాగా డెంగ్యూ కేసులు నమోదైన ఈ మూడు ప్రాంతాల్లో వైద్య బృందం ఫీవర్ సర్వే, యాంటీ లార్వల్ ఆపరేషన్స్ లో భాగంగా టెమిఫోస్ స్ప్రేయింగ్, యాంటీ మాస్క్విటో ఆపరేషన్స్ లో భాగంగా పైరేథ్రం స్ప్రేయింగ్ చేయడం జరిగింది. జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ భాస్కర్ నాయక్ ఈ చర్యలను పరిశీలించారు. ఈ ప్రాంతాలలో ప్రజల కు డెంగ్యూ వ్యాధి నివారణ గురించి అవగాహన కల్పించారు. ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఇండ్లలో నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలని వేడి చేసి చల్లార్చిన నీళ్లనే తాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైద్యాధికారి డా.మను ప్రియ, సూపర్వైజర్ సలోమి, సానిటరీ ఇన్స్పెక్టర్ నరేష్,మెడికల్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story