- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కిరాణా షాప్ లో ఫోన్ పే చేస్తే రూ.28 వేలు మాయం
దిశ, జడ్చర్ల : ఓ కిరాణ షాప్ లో తనకు అవసరం ఉన్న వస్తువులను కొనుగోలు చేసి ఫోన్ పే కు స్కాన్ ద్వారా డబ్బులు పంపించగా.. తన

దిశ, జడ్చర్ల : ఓ కిరాణ షాప్ లో తనకు అవసరం ఉన్న వస్తువులను కొనుగోలు చేసి ఫోన్ పే కు స్కాన్ ద్వారా డబ్బులు పంపించగా.. తన అకౌంట్లో నుంచి రూ.8వేలు మాయమైనట్టు బాలనగర్ పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. బాలనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బాలనగర్ మండలం ఉడిత్యాల గ్రామానికి చెందిన ఎర్ర కృష్ణయ్య ఆర్టీసీ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తుంటాడు. అయితే ఈనెల 4న పనుల నిమిత్తం షాద్ నగర్ కి వెళ్లి అక్కడ ఓ కిరాణం షాపులో తనకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేసి 1260 రూపాయలు ఫోన్ పే స్కాన్ చేసి వచ్చాడు. కొద్ది సేపటి తరువాత తన అకౌంట్లో నుంచి రూ. 28 వేలు ట్రాన్స్ ఫర్ అయినట్టు మెసేజ్ వచ్చింది. వెంటనే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. దీంతో సైబర్ క్రైమ్ సిబ్బంది మీకు దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సూచించడంతో ఎర్ర కృష్ణయ్య బాలనగర్ పోలీసులను ఆశ్రయించాడు. రూ.28 వేలు తిరిగి చెల్లించేలా తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకొని ఘటనపై దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.






