- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జడ్చర్లలో 2.71 కేజీల గంజాయి పట్టివేత
జడ్చర్లలో గంజాయి విక్రయిస్తూ పశ్చిమ బెంగాల్ కు చెందిన ఇద్దరు మహిళలు పట్టు పడడంతో పాటు వారి వద్ద 2.71 కేజీ గంజాయి లభించినట్లు ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ సూపర్డెంట్ ఎల్. నరసింహారెడ్డి తెలిపారు.

దిశ, జడ్చర్ల : జడ్చర్లలో గంజాయి విక్రయిస్తూ పశ్చిమ బెంగాల్ కు చెందిన ఇద్దరు మహిళలు పట్టు పడడంతో పాటు వారి వద్ద 2.71 కేజీ గంజాయి లభించినట్లు ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ సూపర్డెంట్ ఎల్. నరసింహారెడ్డి తెలిపారు. సోమవారం జడ్చర్ల పట్టణంలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎక్సైజ్ అసిస్టెంట్ నర్సింహారెడ్డి వివరాలు వెల్లడించారు. ఎక్సైజ్ జిల్లా డిప్యూటీ కమిషనర్ భాస్కర్ రెడ్డి, జిల్లా అబ్కారి శాఖ అధికారి సుధాకర్ ఆదేశాలతో జడ్చర్ల పట్టణంలోని న్యూ బస్టాండ్ వద్ద జడ్చర్ల ఎక్సైజ్ సీఐ విప్లవ రెడ్డి నేతృత్వంలో న్యూ బస్టాండ్ సమీపంలో విస్తృతంగా తనిఖీలు చేపడుతుండగా.. పశ్చిమబెంగాల్ కు చెందిన ముని బరనో, కల్పన బారమాన్ వద్ద 2.71 కేజీల గంజాయి లభించింది.
దీంతో వారిని వెంటనే అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా.. వారు బెంగాల్ రాష్ట్రం నుండి 30 వేలకు కేజీ చొప్పున గంజాయి తీసుకొని వచ్చి ఐదు గ్రాముల ప్యాకెట్ తయారు చేసి జడ్చర్ల బాల నగర్ లోని పరిశ్రమల వద్ద పనిచేసే కార్మికులే లక్ష్యంగా 300 రూపాయలకు 5 గ్రాముల ఒక ప్యాకెట్ విక్రయిస్తున్నట్లు తమ విచారణలో తెలిసిందని వివరించారు. ఈ ఇద్దరు మహిళల పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. గంజాయి డ్రగ్స్ మత్తు పదార్థాలు ఎవరైనా విక్రయించిన, వాడిన చట్ట ప్రకారం.. చర్యలు చేపడతామని ఇలాంటి కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడితే వారి సమాచారం ఎక్సైజ్ పోలీసులకు అందించాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని చట్టపరంగా శిక్షించేందుకు సహకరించాలన్నారు. పట్టణ ప్రజలకు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎల్ నరసింహారెడ్డి ఎక్సైజ్ సీఐ విప్లవ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్సైలు కార్తీక్ రెడ్డి, జే. నాగరాజు, సిబ్బంది కంటయ్య, సురేష్, పద్మ తదితరులు ఉన్నారు.
జడ్చర్ల లో మరిన్ని గంజాయి ముఠాలు..?
జడ్చర్ల పట్టణంలోని పోలేపల్లి సెజ్ లో అనేక పరిశ్రమలు ఉండటంతో దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వేలాది మంది కార్మికులు ఉద్యోగులు ఈ పరిశ్రమల్లో విధులు నిర్వహిస్తూ ఉంటారు. దీంతో జడ్చర్ల పట్టణంలో ఎవరు ఏ రాష్ట్రం వారు ఏ పరిశ్రమలో పని చేస్తున్నారో గుర్తు పట్టలేని స్థితి నెలకొంది. కొందరు అక్రమార్కులు ఇతర రాష్ట్రాల నుంచి పరిశ్రమలో పని నేపంతో జడ్చర్ల పట్టణంలో నివాసం ఉంటూ కార్మికుల అవసరాలను ఆసరాగా తీసుకొని ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి డ్రగ్స్ సప్లై చేసుకుని ఇక్కడ వారికి గ్రాముల రూపంలో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇద్దరు పశ్చిమబెంగాల్ కు చెందిన మహిళలు గంజాయి విక్రయిస్తూ పట్టు పడడంతో ఇలాంటి ముఠాలు మరిన్ని జడ్చర్ల పట్టణంలో తిరుగుతూ ఉన్నాయని.. వారి వెనుక ఉండి కొందరు ఈ వ్యాపారం చేయిస్తున్నారని పట్టణ ప్రజల ఆరోపిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు మరింత నిఘా పెంచి గంజాయి డ్రగ్స్ విక్రేత మూటలను వారి వెనుక ఉన్న సూత్రధారులను పట్టుకొని జడ్చర్ల యువత కార్మికులు పెడదారిన పట్టకుండా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.






