- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జడ్చర్ల లో నిషేధిత 240 గ్రాముల అల్ప్రా జోలం పట్టివేత
240 గ్రాముల నిషేధిత అల్ప్రా జోలం ద్విచక్ర వాహనం, రెండు సెల్ ఫోన్లు స్వాధీనపరచుకొని ముగ్గురిని రిమాండ్ కు తరలించినట్టు జడ్చర్ల ఎక్సైజ్ సర్కిల్ సీఐ విప్లవ రెడ్డి తెలిపారు.

దిశ, జడ్చర్ల : ఈ మధ్య కాలంలో గంజాయి, అల్ప్రా జోలం వంటివి నిత్యం పట్టుబుడుతున్న ఘటనలు మనం నిత్యం చూస్తేనే ఉన్నాం. తాజాగా 240 గ్రాముల నిషేధిత అల్ప్రా జోలం ద్విచక్ర వాహనం, రెండు సెల్ ఫోన్లు స్వాధీనపరచుకొని ముగ్గురిని రిమాండ్ కు తరలించినట్టు జడ్చర్ల ఎక్సైజ్ సర్కిల్ సీఐ విప్లవ రెడ్డి తెలిపారు. జడ్చర్ల మహబూబ్ నగర్ రహదారి పై గల నక్కల బండ తండా వద్ద అక్రమంగా నిషేధిత విక్రయిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించగా.. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కొండియా నాయక్ కోయిలకొండ మండలానికి చెందిన పెద్ద తండా గ్రామానికి చెందిన కొండయ్య నాయక్ ను తనిఖీ చేయగా అతని వద్ద నిషేధిత 240 గ్రాముల అల్ప్రా జోలం లభించిందని అతన్ని విచారించగా ఇచ్చిన సమాచారంతో అతనికి సరఫరా చేసిన దమ్మైగూడ కు చెందిన మరో ఇద్దరు వ్యక్తులను రాంసాగర్ నాగరాజు లను హైదరాబాద్లోని మౌలాలిలో అదుపులోకి తీసుకొని వారి నుండి 85 గ్రాముల అల్ప్రా జోలం ద్విచక్ర వాహనం రెండు సెల్ ఫోన్లు స్వాధీన పరుచుకున్నట్లు తెలిపారు. వీరుఅల్ప్రా జోలం ఒక గ్రామ కు వెయ్యి రూపాయల చొప్పున మహబూబ్ నగర్ లోకల్ వివిధ గ్రామాల్లో విక్రయిస్తున్నట్లు తెలిసిందని ముగ్గురి పై కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా ముగ్గురికి రిమాండ్ విధించినట్లు సిఐ తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సై లు కార్తీక్ రెడ్డి, నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ లు రమేష్, మురళి మోహన్, కానిస్టేబుల్ సిద్ధార్థ, అనిల్ కుమార్, ఎక్సైజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఎవరైనా నిషేధిత ఆల్ఫాచలం గంజాయి విక్రయిస్తే చట్టపరంగా కఠినంగా చర్యలు తీసుకుంటామని జడ్చర్ల ఎక్సైజ్ సీఐ విప్లవ రెడ్డి తెలిపారు






