- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూరియా తిని 12 మేకలు మృతి
దిశ, నవాబుపేట : ప్రమాదవశాత్తు యూరియా తిని 12 మేకలు మృతి చెందిన విషాదకర సంఘటన ఆదివారం సాయంత్రం మండల పరిధిలోని అమ్మాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.

దిశ, నవాబుపేట : ప్రమాదవశాత్తు యూరియా తిని 12 మేకలు మృతి చెందిన విషాదకర సంఘటన ఆదివారం సాయంత్రం మండల పరిధిలోని అమ్మాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. దీంతో మేకల యజమాని మంగలి ప్రభాకర్ కు సుమారు రెండు లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లింది. స్థిర, చరాస్తులు ఎలాంటివి లేని ప్రభాకర్ మేకల పెంపకం జీవనాధారంగా చేసుకుని బ్రతుకుతున్నాడు. ఆయన తన దగ్గర గల 25 మేకలను వెంట తీసుకుని ప్రతిరోజు మాదిరిగానే గ్రామ సమీపంలో గల మంగలి మాసయ్య వ్యవసాయ పొలంలో పిల్లి గోపాల్ అనే రైతు సాగుచేసిన మొక్కజొన్న సొప్పలో మేత మేపుతుండగా ఆ సొప్పలో పడవేసి ఉన్న యూరియాను ప్రమాదవశాత్తు మేకలు తిని అక్కడికక్కడేపడి మరణించాయి. ఆ సమయంలో ఆ పంట పొలంలోనే మరోవైపు పంట సాగు చేసిన రైతుకు వ్యవసాయ పనిలో సహాయంగా ఉన్న మేకల యజమాని ప్రభాకర్ మేకలు మృత్యువాత పడడం చూసి లబోదిబోమన్నారు. మేకల మృతి వల్ల తనకు సుమారు రెండు లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని, తాను జీవనోపాధి కోల్పోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. మేకల మృతితో జీవనోపాధి కోల్పోయి తీవ్రంగా నష్టపోయిన మంగలి ప్రభాకర్, యాదమ్మ దంపతులకు ఆర్థిక సహాయం అందించి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆదుకోవాలని గ్రామ ప్రజలు కోరారు.






