- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాధితులకు 106 మొబైల్ ఫోన్లు అందజేత
by Ratna Kumari |
దిశ, నారాయణపేట క్రైమ్ : పలుచోట్ల సెల్ ఫోన్ లను పోగొట్టుకున్న బాధితులకు ఎస్పీ వినీత్ కుమార్ శుక్రవారం సీఈఐఆర్ ద్వారా గుర్తించి రికవరీ చేసిన సెల్ ఫోన్లను పోలీసు

X
దిశ, నారాయణపేట క్రైమ్ : పలుచోట్ల సెల్ ఫోన్ లను పోగొట్టుకున్న బాధితులకు ఎస్పీ వినీత్ కుమార్ శుక్రవారం సీఈఐఆర్ ద్వారా గుర్తించి రికవరీ చేసిన సెల్ ఫోన్లను పోలీసు కార్యాలయంలో అందించారు. జిల్లా వ్యాప్తంగా గడిచిన మూడు నెలల్లో మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు రికవరీ చేసి 106 మొబైల్ ఫోన్లను అందించినట్లు ఎస్పీ వెల్లడించారు. వీటి విలువ సుమారు రూ. 16 లక్షల వరకు ఉంటుందన్నారు. ఎవరైనా సెల్ ఫోన్ పోగొట్టుకుంటే సీఈఐఆర్ పోర్టల్ లో, దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో వెంటనే ఫిర్యాదు చేయాలన్నారు. డీఎస్పీలు ఎన్. లింగయ్య, మహేష్, సీఐలు శివశంకర్, రాజేందర్ రెడ్డి, రామ్ లాల్, సైదులు, ఐటి కోర్ ఎస్ఐ సురేష్ పాల్గొన్నారు.
Next Story






