ఎస్సీ యాక్షన్ ప్లాన్ లో మండలానికి 10 యూనిట్లు మంజూరు

by Nallavelli.Anjaneyulu |

2025-26 సంవ‌త్స‌రానికి సంబంధించి యాక్ష‌న్ ప్లాన్ లో భాగంగా ట్రాన్స్ ఫార్మ‌ర్ విభాగం ఎల‌క్ట్రిక‌ల్ వెహికిల్స్ టూ వీల‌ర్ ఆరు యూనిట్లు, త్రీ వీలర్స్ నాలుగు యూనిట్లు మంజూరైనట్లు కొల్లాపూర్ ఇన్ చార్జి యాదగిరి తెలిపారు.

ఎస్సీ యాక్షన్ ప్లాన్ లో మండలానికి 10 యూనిట్లు మంజూరు
X

దిశ, కొల్లాపూర్ : 2025-26 సంవ‌త్స‌రానికి సంబంధించి యాక్ష‌న్ ప్లాన్ లో భాగంగా ట్రాన్స్ ఫార్మ‌ర్ విభాగం ఎల‌క్ట్రిక‌ల్ వెహికిల్స్ టూ వీల‌ర్ ఆరు యూనిట్లు, త్రీ వీలర్స్ నాలుగు యూనిట్లు మంజూరైనట్లు కొల్లాపూర్ ఇన్ చార్జి యాదగిరి తెలిపారు. ఈ వెహికల్స్ ను సబ్సిడీ లోన్ ద్వారా OBMMS ఆన్లైన్ వెబ్సైట్ లో తేది17 నుంచి 24వ తేదీ ఎస్సీ యువత అప్లై చేసుకోవాలని ఆయన చెప్పారు. ట్రాన్స్ ఫార్మ‌ర్ విభాగం నుంచి కొల్లాపూర్ మండలానికి ఎస్సీ కేటగిరీ I/ II/ III వారిగా ద్విచక్ర వాహనములు(బైకులు) 06 యూనిట్లు కేటాయించారు. అలాగే త్రీ వీలర్స్ (ఆటోలు) 04 యూనిట్లు మంజూరైనట్లు ఎంపీడీఓ యాదగిరి తెలిపారు. అర్హులైన ఎస్సీ యువత మీసేవ కేంద్రంలో ఈరోజు నుంచి ఈనెల 24 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోగలరని ఆయన విజ్ఞప్తి చేశారు.

Next Story