బాధిత కుటుంబానికి రూ.10వేలు ఆర్థిక స‌హాయం

by Nallavelli.Anjaneyulu |

ఒకే కుటుంబానికి చెందిన తల్లి కూతురు (కుందేటి స్రవంతి, దేవిక) స్వల్ప వ్యవధి కాలంలో అనారోగ్య సమస్యతో మరణించడంతో ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించారు.

బాధిత కుటుంబానికి రూ.10వేలు ఆర్థిక స‌హాయం
X

దిశ‌, ఉప్పునుంత‌ల : ఒకే కుటుంబానికి చెందిన తల్లి కూతురు (కుందేటి స్రవంతి,దేవిక) స్వల్ప వ్యవధి కాలంలో అనారోగ్య సమస్యతో మరణించడంతో ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలని సంకల్పంతో మండలంలోని దాసర్ల పల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ బోధనపల్లి రమేష్ రెడ్డి ఆదేశాల మేరకు పాలకవర్గం ముందుకొచ్చి ఉప సర్పంచ్ పొన్నగంటి శంకర్ ఆధ్వర్యంలో రూ.5వేలు, బీజేపీ నేత గంగుల అమరేందర్ రెడ్డి రూ.5వేలు కలిపి రూ. 10 వేలు కుటుంబ యజమాని కుందేటి కృష్ణయ్యకు అందజేశారు. బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆర్థిక సహాయం చేయడం ఆనందంగా ఉందన్నారు. బాధిత కుటుంబానికి గ్రామ పాలకవర్గం ఎల్లప్పుడు అండగా ఉంటుందని భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా మేము ముందుండి ఆదుకుంటామని వారు భరోసా కల్పించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Next Story