Maha Kumbhabhishekam : కాళేశ్వరంలో నేడు మహాకుంభాభిషేకం

by Muthe.Rajitha |

జయశంకర్‌ భూపాలపల్లి(Jayashankar Bhupalapalli) జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం ముక్తేశ్వర స్వామికి నేడు మహకుంభాభిషేకం(Maha Kumbhabhishekam) జరగనుంది.

Maha Kumbhabhishekam : కాళేశ్వరంలో నేడు మహాకుంభాభిషేకం
X

దిశ, వెబ్ డెస్క్ : జయశంకర్‌ భూపాలపల్లి(Jayashankar Bhupalapalli) జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం ముక్తేశ్వర స్వామికి నేడు మహకుంభాభిషేకం(Maha Kumbhabhishekam) జరగనుంది. దాదాపు 4 దశాబ్దాల తరువాత ఈ మహాకుంభాభిషేకం జరుగుతున్నట్టు ఆలయ నిర్వహకులు తెలియ జేశారు. మూడు రోజుల పాటు జరిగే ఈ క్రతువు.. శుక్రవారం ఉదయం మొదలవగా.. సద్గురు సచ్చిదానంద సరస్వతి(Sadguru Sachchidaananda Saraswathi) పర్యవేక్షణలో ఉ.10:42 సుముహూర్తంలో కుంభాభిషేక మహోత్సవం జరగనుంది. ఈ మహా ఘట్టం కోసం దేవాదాయ, ఇతర శాఖల అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ మహకుంభాభిషేక మహోత్సవంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surekha), ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బాబు(SridharBabu), రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) పాల్గొననున్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్(Election Code) అమలులో ఉన్న కారణంగా ఈసీ(EC) ప్రత్యేక అనుమతి తీసుకొని వీరు ఈ పూజా కార్యక్రమానికి హాజరు కానున్నారని సమాచారం.

ఇక 1982లో చివరిసారిగా కాళేశ్వర ముక్తేశ్వరస్వామికి కుంభాభిషేకం నిర్వహించారు. నాటి శృంగేరి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్యుల ఆధ్వర్యంలో క్రతువును జరిపించారు. ప్రస్తుతం 42 ఏళ్లకు మహాఘట్టం జరుగుతోంది. ఇప్పుడు కూడా శృంగేరి పీఠాధిపతుల ఆశీస్సులతో జరగడం విశేషం. కాగా మహకుంభాభిషేకానికి కొద్దిరోజుల ముందు నుంచే భక్తుల తాకిడి పెరిగింది. ఈ మూడు రోజులు మరింత ఎక్కువ సంఖ్యలో భక్తులు కాళేశ్వరుని దర్శనానికి రానున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని తెలియజేశారు. నిరంతర అన్నదాన ప్రసాద పంపిణీ, తాగునీరు, భక్తులు గోదావరిలో స్నానాల అనంతరం దుస్తులు మార్చుకునే గదులు, షామియానాలు, వాష్ రూమ్స్ వంటి ఏర్పాట్లు చేశామని అన్నారు.

Next Story