- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Maganti Sunitha: జూబ్లీహిల్స్.. ఓటమి తర్వాత మాగంటి సునీత ఎమోషనల్ ట్వీట్
తన ఓటమి ఫలితాల అనంతరం మాగంటి సునీత శుక్రవారం ఎమోషనల్ ట్వీట్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత(Maganti Sunitha)పై ఆయన 24,729 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ నేపథ్యంలోనే తన ఓటమి ఫలితాల అనంతరం మాగంటి సునీత శుక్రవారం ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘స్వర్గీయ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆశయాలను నెరవేర్చేందుకు, జూబ్లీహిల్స్ ప్రజలకు అండగా నిలవడానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన నాపై నమ్మకంతో నాకు ఓటేసి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని ఆమె పేర్కొన్నారు. బీఆర్ఎస్ విజయం కోసం కష్టపడ్డ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తూ.. ‘ఈ ఎన్నికల్లో ఓడిపోయినా, అదే అంకితభావంతో ప్రజాసేవలో ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను’ అని మాగంటి సునీత తెలిపారు. ట్వీట్ ఇదే..
READ MORE ....
ఆడబిడ్డపై కుట్రలు చేశారు.. రౌడీయిజమే గెలిచింది: మాగంటి సునీత ఎమోషనల్






