BRS: ప్రజాక్షేత్రంలో మాగంటి గోపినాథ్ వారసులు.. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక గెలుపే టార్గెట్!

by Ramesh Naini |   (  Updated:2025-09-09 12:21:55  IST  )

సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో ఈ స్థానం ఖాళీగా ఉంది.

BRS: ప్రజాక్షేత్రంలో మాగంటి గోపినాథ్ వారసులు.. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక గెలుపే టార్గెట్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Jubilee Hills by-election) జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో త్వరలో ఉపఎన్నికలు జరగనున్నాయి. సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ (Maganti Gopinath) మృతితో ఈ స్థానం ఖాళీగా ఉంది. ఈ క్రమంలోనే ఉప ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. ప్రధాన పార్టీలు అభ్యర్థుల ప్రకటన చేయకపోయినప్పటికీ నియోజకవర్గంలో ఆశావహులు సందడి చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ తరపున మాగంటి గోపినాథ్ వారసులు రంగంలోకి దిగారు. తమ స్థానం చేజారిపోకుండా ఉండటం కోసం ప్రజాక్షేత్రంలోకి గోపీనాథ్ కుమార్తెలు ప్రజలను కలుసుకోని వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గోపీనాథ్ బిడ్డలు అక్షర, దిశిరకు అడుగడుగునా స్వాగతం, అభిమానుల నీరాజనం లభిస్తోంది. అక్షర, దిశిరలో గోపన్నను చూసుకున్నట్టే ఉందని స్థానికులు ఆవేదనకు లోనవుతున్నారు. “మీకు మేమున్నాం” అంటూ గోపీనాథ్ చేసిన సేవలను స్మరించుకుంటూ, ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని వారు భరోసా ఇచ్చారు. కాగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గోపీనాథ్ కుటుంబానికి టికెట్ ఇచ్చే ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఉపఎన్నిక గెలుపు కోసం మరోవైపు కాంగ్రెస్, బీజేపీ తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి. ట్వీట్ లింక్..

Next Story