TG News : వారి మధ్య మద్రాసు ఒప్పందం కుదిరింది : ఏలేటి సంచలన వ్యాఖ్యలు

by Muthe.Rajitha |

బీజేపీఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

TG News : వారి మధ్య మద్రాసు ఒప్పందం కుదిరింది : ఏలేటి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : బీజేపీఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS) రెండూ ఒకటేనంటూ విరుచుకు పడ్డారు. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ తోక పార్టీ అయ్యిందని ఏలేటి మండిపడ్డారు. కాంగ్రెస్ కు మద్ధతు ఇస్తూ బీజేపీ మీద కేటీఆర్ రాళ్ళు విసురుతున్నారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఐదేళ్లు సీఎంగా ఉండాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) బలంగా కోరుకుంటున్నారని అన్నారు. ఇటీవల తమిళనాడు(Tamailanadu) వెళ్ళిన కేటీఆర్(KTR), రేవంత్.. చెన్నై వేదికగా చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు.

మద్రాసు ఒప్పందం వల్లే కేసీఆర్, కేటీఆర్ కుంభకోణాలపై రేవంత్ గాని, ఆ పార్టీ నాయకులు గాని నోరు ఎత్తడం లేదని, అందుకే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శలు చేశారు. వారి మధ్య ఉన్న ఒప్పందం నిజం కాకపోతే హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవి రెండూ ఎందుకు పోటీ నుంచి తప్పుకున్నాయో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

Next Story