- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth Reddy: థాంక్యూ సీఎం సార్.. రేవంత్ రెడ్డితో మాదిగ ఎమ్మెల్యేల భేటీ
సీఎం రేవంత్ రెడ్డిని మాదిగ ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలిశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) కాంగ్రెస్ మాదిగ ఎమ్మెల్యేలు (Madiga MLAs) భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో భేటీ అయి మంత్రివర్గంలో తమ సామాజిక వర్గానికి చోటు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ శాలువాతో సత్కరించారు. ఇటీవల జరిగిన కేబినెట్ విస్తరణలో మాదిగ సామాజికి వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్ కు అవకాశం దక్కింది. ఆయనకు ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమం, మైనార్టీ సంక్షేమం, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ లు, ట్రాన్స్ జెండర్స్ శాఖలను అప్పగించారు. అంతకు ముందు తమ సామాజికి వర్గానికి కేబినెట్ విస్తరణలో అవకాశం ఇవ్వాలని మాదిగ ఎమ్మెల్యేలు పలు సార్లు సీఎంను భేటీ అయ్యారు. అందుకు అనుగుణంగా మంత్రివర్గ విస్తరణలో వివేక్, వాకిటి శ్రీహరితో పాటు మాదిగ సమాజిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్ (Minister Adluri Laxman) కు చోటు దక్కింది. ఈ నేపథ్యంలో అడ్లూరి లక్ష్మణ్ సహా పలువురు మాదిగ సామాజిక ఎమ్మెల్యేలు ఇవాళ సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలే యాదయ్యతో పాటు మంత్రులు వాకిటి శ్రీహరి (Vakiti Srihari), జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao) తదితరులు ఉన్నారు.






