CM రేవంత్‌ను కలిసిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి

by Gantepaka Srikanth |

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్(Mohan Yadav), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని మర్యాద పూర్వకంగా కలిశారు.

CM రేవంత్‌ను కలిసిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్(Mohan Yadav), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని మర్యాద పూర్వకంగా కలిశారు. శనివారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ నివాసంలో ఇరువురూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రేవంత్ రెడ్డి వివరించారు. ప్రధానంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల గురించి మోహన్ యాదవ్‌కి తెలియజేశారు. ఆరు గ్యారంటీలు.. సన్నబియ్యం పథకం, ఉచిత విద్యుత్తు, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు తదితర పథకాలను వివరించారు.

Next Story